దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంపై అక్కడి మీడియా వరుసుగా కథనాలు ఇస్తున్నాయి. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వెళ్తాడని అన్ని ప్రచార మాధ్యమాలు కోడై కూస్తున్నాయి. అయితే విజయ్ అధికారికంగా తన రాజకీయ అరంగేట్రం పై ప్రకటన చేయనప్పటికీ ఆయన అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం వచ్చే ఎన్నికలలో విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి నిలబడతాడని చెబుతున్నారు. నిజానికి విజయ్ దళపతి రెండేళ్ల క్రితమే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అదే విషయం తన తండ్రి ముందే లీక్ చేయటం, తర్వాత తన సినిమాలు ఫ్లాప్ అవటంతో, సరైన టైం కాదని, ఇంతకాలం వేచి చూశాడట. ఏదేమైనా ఇప్పుడు దసరా తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న లియో మూవీ పూర్తి చేసి, అది రిలీజ్ అయ్యేలోపే తమిళ నాడు అంతటా పాద యాత్ర చేయాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యిందనే మాటే వినిపిస్తోంది. లియో దసరా కి విడుదల తర్వాత వెంకట్ ప్రభు మేకింగ్ లో మరో మూవీ రానుంది. ఆతర్వాత శంకర్ మేకింగ్ లో పొలిటికల్ డ్రామా చేయనున్నాడని అది 2024 కి తమిళ నాడులో జరిగే ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యేలా శంకర్ ని ప్లాన్ చేయమన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న విజయ్ సినిమాల కలెక్షన్లు హిట్ ఫట్ తో సంభంధం లేకుండా మినిమం లో మినిమం 200 కోట్లకు పైమాటే రజనీకాంత్ తర్వాత మాస్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ ముందు వరుసలో ఉన్నాడు. అతని అభిమానులు కూడా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కోరుతున్నారు. ఒకవేళ విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే సినీ ప్రముఖులతో పాటు వేరే పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చాలామంది ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని విధాలుగా ఒత్తిడి ఉన్న సరే తన రాజకీయ ప్రవేశంపై విజయ్ పెదవిప్పడం లేదు. కానీ ఖచ్చితంగా ఏదోక రోజు తన నిర్ణయం చెప్పడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.