అమెరికాకు సునామీ హెచ్చరికలు

అగ్ర దేశం అమెరికాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ అలస్కా, అలస్కా ఐలాండ్ ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలకు అలాగే కెనడా తీర ప్రాంతాలపై సునామీ ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఆయిన మారే అవకాశం ఉందని, ఒకవేళ సునామీ ఉగ్రరూపం చూపిస్తే ఆస్తి నష్టం తో పాటు తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో భారీ సంభవించిన భారీ భూకంపం ఆదివారం ఉదయం అలస్కా పెన్నిసులా రీజియన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతెలిపింది. ఈ భూకంపం 9.3 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. అలస్కా ద్వీపం,అలూటియన్ దీవుల,కుక్ ఇన్ లెట్ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. అలాస్కా భూకంప క్రియాశీల పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగమని అధికారులు చెబుతున్నారు.1964లో 9.2 తీవ్రతతో అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. ఇది అలస్కాలోని యాంకరేజ్ సిటీని నాశనం చేసింది. అలస్కా తీరం,అమెరికా పశ్చిమ తీరం, హవాయిని నాశనం చేసిన సునామీని సృష్టించింది. భూకంపం, సునామీ కారణంగా 250 మందికి పైగా మరణించారు. వేలమంది గల్లంతయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అదే స్థాయిలో భూకంపం చోటు చేసుకోవడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే గతంలో 9.2 తీవ్రతతో భూకంపం చోటు చేసుకోగా , నేడు 7.4 గా రిక్టర్ స్కేల్ పై నమోదయింది. అమెరికా ప్రజలు మాత్రం సునామీ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. కొందరు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More