హర్యానా లో అధికారం ఖాయమనుకున్న కాంగ్రెస్ కి ఫలితాలు కంగు తినిపించాయి.. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్ష విజయాన్ని కట్టబెడితే… వాస్తవ ఫలితాలు బీజేపీ కి హ్యాట్రిక్ విక్టరీ ని అందించాయి.. ఓటమి ని ఈవీఎంల పై నెట్టేసి 2029 ఎన్నికల్లో అధికారం మాదే అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా తప్పులు దిద్దుకునే పనిలో మాత్రం పడలేదు. నిజానికి కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం అంటే కాంగ్రెస్ అన్నట్లుగా అయిపోయిన దేశం లో నేతృత్వం ఆ కుటుంబంలో కాకుండా విధేయుల చేతిలో ఉంటే వర్కవుట్ అవుతుందా..? నేతలు కానీ కార్యకర్తలు కానీ కోరుకున్నదేంటి…? పార్టీ లో జరుగుతున్నదేంటీ ఇప్పుడిదే చర్చ.. రెండుచోట్ల ఎంపీ గా గెలిచిన రాహుల్ గాంధీ వాయినాడ్ స్థానానికి రాజీనామా చేసిన నేపధ్యంలో ఇప్పుడు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 13న ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు.. ఆ స్థానాన్ని నిలుపుకోవడం ఆ పార్టీ కి ఎంత ముఖ్యమో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఉనికి నిలుపుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం.. జాతీయ స్థాయిలో నాయకత్వం మారితే అదేమంత కష్టం కాదు అనేది సగటు కాంగ్రెస్ కార్యకర్తల అంతర్మధనం.. యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాలంటే రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు కచ్చితంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది..
నవంబర్ ఎన్నికల సంగతి పక్కన పెడితే వచ్చే సార్వత్రిక సమరానికైనా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం కొంతైనా ఉంది.. నిజానికి క్రమక్రమంగా తగ్గుతున్న మోడీ గ్రాఫ్ ని అంది పుచ్చుకుని పార్టీకి ప్లస్ చేసే నేత కాంగ్రెస్ పార్టీ లో లేకపోవడం ఆ పార్టీ కి అతిపెద్ద మైనస్ కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకునైన జాతీయ స్థాయి లో ప్రభావితం చేసే నేత అవసరం చాలానే ఉంది.. నడి సముద్రం లో ఉన్న పార్టీని ఏ ఒడ్డుకు చేర్చాలన్నా పర్ఫెక్ట్ గా దిశానిర్దేశం చేసే నాయకుడి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది.. ఆ నేతలు గాంధీ కుటుంబం నుంచి మాత్రమే రావాలని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే అంత ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కాదు .. వయసు రీత్యా గానీ.., ఆరోగ్య రీత్యా గానీ.. వచ్చే ఎన్నికలకు ఆయన ఎక్టీవ్ పార్ట్ తీసుకునే పరిస్థితుల్లో లేకపోవచ్చు.. ఎన్నికలను సీరియస్ గా తీసుకునే పక్షం లో దేశ వ్యాప్తంగా నాయకత్వ మార్పుపై వస్తున్న డిమాండ్ ను కూడా ఇప్పుడే సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది.. మైనార్టీ ఓటు బ్యాంకు పైనే ఎక్కువగా ఆధారపడే కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే పంథాలో కాకుండా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.. అధికారం లోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి పగ్గాలు చేపట్టామన్న విషయాన్ని అధిష్టానం విస్మరించకూడదు.. నవంబర్13న వాయినాడ్ లో ప్రియాంక గెలిచినా దేశం లో గెలవాలంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందే తప్పా మరో ప్రత్యామ్నాయం వేతకకూడదు.. ఓటమి పై సాకులు మానుకుని ప్రణాళికలు వేసుకుంటేనే అధికార భాజపా కు దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం దొరికినట్లు.. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇక ప్రాంతీయ పార్టీగా మారిపోవచ్చు.