జగన్ ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఇచ్చేసిన నాగబాబు

ఆంధ్రప్రదేశ్ వరదల ఉపద్రవం పై మాజీ ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల సందర్శనలో భాగం గా ఈ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (Man Made Disaster) అని వ్యాఖ్యానించడం పై జనసేన నేత నాగబాబు జగన్ రెడ్డి పై సోషల్ మీడియా వేదిక గా తీవ్రం గా విరుచుకు పడ్డారు..
“మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి.
ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం.చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ.రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు”. దీన్ని అంటారు సార్… Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural Disaster కి Man made Disaster కి తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను….మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు Man Made Disaster అని గమనించగలరు.వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది.
విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను
అంటూ ఉదాహరణలతో సహా పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది..

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More