చంద్రబాబే నంబర్ వన్

‘ఇండియా టుడే’ కథనం

ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు..

ఇక అత్యంత శ‌క్తిమంతులైన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు తర్వాత బిహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రులు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు. జైలుకెళ్లి రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలా పునర్జన్మ ఎత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని ‘ఇండియా టుడే’ క‌థ‌నం అభివ‌ర్ణించింది. హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చరిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్ర‌శంసించింది. ప్ర‌స్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది.
అలాగే జనసేన, బీజేపీతో కూట‌మిగా ఏర్ప‌డి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారం నాటి త‌న‌ ప్రత్యేక కథనంలో చంద్ర‌బాబుకు ‘ఇండియా టుడే’ కితాబిచ్చింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది.
ఇటీవల విజన్‌-2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరించి 15 శాతం వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారని కార్పొరేట్లతో స్నేహ‌భావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు” అని ‘ఇండియా టుడే’ త‌న కథనంలో రాసుకొచ్చింది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More