టీడీపీ ని నిలిపేది… గెలిపించేది ఆ ఒక్కడే

నందమూరి తారక రామారావు ఈ పేరు ఒకప్పుడు పెద్ద ప్రభంజనం. ఇప్పుడు అదే పేరుతో ఉన్న అతని మనవడు జూనియర్ ఎన్టీయార్ కూడా తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎవరు ఊహించని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ కు తగిన వారసలం మేమే అంటూ అతని కుటుంబీకులు బాహటంగానే చెబుతున్న వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తాత చరిష్మాను, ప్రజాభిమానాన్ని పొందే అర్హత ఉంది అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదంటున్నారు విశ్లేషకులు. రాజకీయాలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సినిమాలలో నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందనే చెప్పాలి. తెలంగాణలో అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఆంధ్రాలో కింద మీద పడుతూ వైసిపి, జనసేనలను దీటుగా ఎదుర్కోవడానికి అపసోపాలు పడుతుంది. వచ్చే ఎన్నికలలో టిడిపి కనుక అధికారంలోకి రాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ లో టిడిపి పూర్తిగా లేనట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా చాలా బాగా పనిచేస్తున్నప్పటికి ఓటింగ్ శాతం విషయం లో మాత్రం డౌటానుమానమే.. అయితే టిడిపికి అంత స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళైతే ఎవరు లేరనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే టిడిపి శ్రేణులను సంఘటితం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగల సత్తా ఉందని అటు టిడిపి నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే బిజెపి అధిష్టానం కూడా జూనియర్ ఎన్టీఆర్ పై దృష్టి పెట్టింది. బిజెపి అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా కూడా నేరుగా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. సొంత టిడిపి పార్టీ నేతలు గుర్తించకపోయిన బిజెపి గుర్తించి అతనికి సముచిత స్థానం ఇచ్చేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో బిజెపి సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలనేది కూడా బిజెపి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.. సీనియర్ హీరోలతో పోటీపడి టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానానికి చేరువైన జూనియర్ ఎన్టీఆర్ కు కొన్ని చేదు అనుభవాలు ఎదురు కావడంతో రేసులో వెనక పడ్డాడని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో టాలీవుడ్ హీరోలలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. సీనియర్ నటులనే కాకుండా టెక్నీషియన్ లు కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి చేరుకొని దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయితే చిరంజీవి తర్వాత మాత్రం ఈ జనరేషన్లో ఆ స్థాయికి వెళ్లగలగే ఒకే ఒక నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ నెంబర్ వన్ స్థానానికి రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ పోటీలో ఉన్నారు. వీరందరూ కూడా గొప్ప నటులే. వీరందరికీ కూడా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వీళ్ళందర్లో ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు. ఏక సంధాగ్రహి, నడిచే కంప్యూటర్ లా కనిపించే ఎన్టీఆర్ కు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. డాన్స్ అయినా, డైలాగ్ అయిన, యాక్షన్ అయినా సింగిల్ టేక్ లో చేయాల్సిందే. ఇక బయట అయితే సందర్భానుసారం, సమయానుకూలంగా, పరిస్థితులను బట్టి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం, ఎవరిని నొప్పించకుండా ప్రవర్తించడం, హద్దు దాటి మాట్లాడకుండా ఉండటం, అందరితో కలివిడిగా ఉండటం, పెద్దలకు మరింత గౌరవాన్నిచ్చి వారి అభిమానం చూరగొనడం, అభిమానుల పట్ల మరింత ప్రేమగా మసులుకోవడం వలన జూనియర్ ఎన్టీఆర్ కీర్తి మరింత పెరిగింది. అంతా స్టార్ ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను సొంత పార్టీ టిడిపి పక్కన పెట్టేయడం పై కూడా టిడిపి శ్రేణులు, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ ఏనాడు కూడా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ కోసం కానీ, ఆ పార్టీ నేతల కోసం సందర్భంగా ఎప్పుడు మాట్లాడలేదు. తాత స్థాపించిన టిడిపి పార్టీకి విధేయుడు గానే ఉంటానని ఇప్పటికి కూడా చెబుతూనే ఉన్నారు. అంత ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను వైసీపీ శ్రేణులు దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. మరోపక్క బీజేపీ కూడా నేరుగా రంగంలోకి దిగి అతనిని పార్టీలోకి ఆహ్వానించాలనే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే బిజెపి నేతలు ఎన్టీఆర్ ను కలవడం వెనక బిజెపి ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమేయం ఉందని అంటున్నారు.. కానీ దీని వెనక ఉన్నది మాత్రం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని రాజకీయ విశ్లేషకులు చెప్పడం కొసమెరుపు.. తెలంగాణలో మంచి క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపి నాయకునిగా కాకుండా బిజెపికి అనుకూలమైన వ్యక్తిగా రంగంలోకి దించితే అది టిడిపికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని చంద్రబాబునాయుడు ఆలోచనగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చతికిలబడిన టిడిపికి ఆక్సిజన్ అందించి ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే వ్యక్తి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఇక్కడ స్పష్టమవుతుంది. భవిష్యత్తులో రాష్ట్రమేదైన అతను ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని రాజకీయపండితులే కాదు.. జ్యోతీష్యులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More