తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి లో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.. 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. హీరోగా విలన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ లలో మెప్పించిన కృష్ణంరాజు 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు . 1986లో ‘తాండ్రపాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. దాదాపు 200 సినిమాలలో నటించి నటుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు కి. దర్శకత్వం చెయ్యాలని ఉందని చాలా సందర్భాలలో వెల్లడించారు తాను దర్శకత్వం వహించేందుకు రెండు సబ్జెక్టు లు సిద్ధం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు.. అందులో విశాలనేత్రాలు… విభిన్న కధా చిత్రమని అది ముందుగా చేయనున్నామని అలాగే తాను నటించిన చిత్రాల్లో భక్త కన్నప్ప సినిమా ను తన వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రీమేక్ చేయాలని ఉందని చాలా సందర్భాలలో చెప్పడమే కాకుండా నిర్మాణ ప్రయత్నాలు కూడా చేశారు.. అయితే ఇవి తీరకుండానే ఆయన కన్నుమూయడం విచారకరం.. అలాగే తన వారసుడి వివాహం కూడా చూడాలని ఉందని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు రెబల్ స్టార్ నటించిన ఆఖరి చిత్రం రాధేశ్యాం లో ఆయన నిర్మాణ భాగస్వామి కూడా. కృష్ణంరాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.