దగ్గుబాటి పురందేశ్వరి మళ్ళీ కేంద్రమంత్రి కాబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.. ఇటీవలే రెండు కీలక భాద్యతల నుండి పురంధ్రీశ్వరి ని తప్పించిన పార్టీ అధినాయకత్వం కేబినెట్ లోకి తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని చెపుతున్నారు. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బిజెపిలో చేరిన ఆమెకు కాంగ్రెస్ లాగే బీజేపీ హైకమాండ్ కూడా కీలకమైన పదవులతో ప్రాధాన్యత ఇచ్చింది పురంధ్రీశ్వరీ ని బిజెపి మహిళా మోర్చాగా నియమించారు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ బిజెపికి ఇన్చార్జిగా కూడా వేశారు అయితే ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల ఇన్చార్జి పదవి నుంచి ఆమెను తొలగించారు ఆమె స్థానంలో అమిత్ షా సన్నిహితులను నియమించారు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో పార్టీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్న తరుణం లో ఆంధ్రప్రదేశ్ కి ఏదో చేస్తున్నామన్న సంకేతం పంపించాలంటే ఇలాంటి నిర్ణయం సరైనదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రెండో తరంలో మోడీ బృందంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం లేదు నిజానికి గత కాలంలో కూడా మోడీ టీం లోకి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ బీజేపీ నాయకుడు రాలేదు ఇదే జరిగితే 2018 ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇదే తొలి ప్రాతినిధ్యం అవుతుంది. ఇదిలా ఉండగా తెలంగాణకు కిషన్ రెడ్డి రూపంలో ప్రాతినిధ్యం ఉంది 2024 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ ఓటర్లను తిప్పుకునేందుకు ఈ పునర్విభజనలో పురందరేశ్వరి కూడా అవకాశం దొరుకుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి యూపీఏ హయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రెండుసార్లు గెలిచిన పురంధ్రీశ్వరీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఉన్న గుర్తింపుతో ఏపీ లో పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.. 2024 టీం ని సిద్ధం చేసే వ్యూహం లో భాగం గా ఊహించని మార్పులు రెండు రాష్ట్రాలలో జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.