అగ్నిపర్వతాల పేలుళ్ల వల్లే ఆక్సిజన్ పుట్టిందా ?

మన మనుగడకు కారణమైన భూమిపై ముందు ఆక్సిజన్ ఉండేది కాదని తర్వాతి కాలంలో అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల ఆక్సిజన్‌‌ పుట్టిందని, 2.4 బిలియన్‌‌ ఏళ్ళ క్రితం ఈ అసలు ఆక్సిజన్‌‌ అనేదే ఉండేది కాదని స్పష్టం చేస్తున్నారు. సైంటిస్టుల ఈ ప్రకటనతో చాలా మందికి సందేహాలు కూడా తలెత్తాయి. భూమి ప్రారంభం దశలో ఆక్సిజన్ లేకపోవడం ఏంటి ? ఆక్సిజన్ అనేది అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల పుట్టడమేంటి అనే చర్చ కూడా మొదలైంది. యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్​ సైంటిస్టులు మాత్రం ఇదే వాస్తవమానంటూ బల్లగుద్ది మరి చెబుతున్నారు. అయితే అంతకు ముందు భూమిపై ఎలాంటి జీవం ఉండేదో అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని అంటున్నారు. అగ్నిపర్వతాల పేలుళ్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లోని రాళ్లపై పరిశోధనలు జరిపిన అనంతరం తాము ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆక్సిజనేషన్‌‌ ఈవెంట్‌‌ యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్‌‌ పరిశోధకులు తెలియజేస్తున్నారు.. ఈ రాక్‌‌ రికార్డర్స్‌‌ ఎనాలసిస్‌‌ ప్రకారం అగ్నిపర్వతాలు ఏర్పడక ముందు ఆక్సిజన్‌‌ లేదని, వాల్కనోస్‌‌ చర్యల వల్లే ఆక్సిజన్‌‌ పుట్టిందని తాము గుర్తించామని ఈ వాల్కానిక్‌‌ యాక్టివిటీస్‌‌ని మెర్క్యూరీ పెరుగుదల కారణంగా జరిగిందంటున్నారు. అగ్నిపర్వతాల్లో ఉండే లావా, ఖనిజాలు, బూడిదల స్ట్రీమింగ్‌‌ సముద్రంలో కలిసినప్పుడు సముద్రంలో ఉండే సైనోబ్యాక్టీరియా యాక్టివేట్‌‌ అయి ఆక్సిజన్‌‌ను రిలీజ్‌‌ చేయడం మొదలుపెట్టిందని, మొదటగా ఏక కణ జీవులు ఉత్పాదకతకు ఆక్సిజన్‌‌ను పంప్‌‌ చేయడం స్టార్ట్‌‌ చేసిందని రీసెర్చర్స్‌‌ తెలిపారు. అంతకుముందు ఉండే రాళ్లు, జీవ రహిత పదార్థాలకు ఆక్సిజన్‌‌ వినియోగం అంతగా లేకపోయినా తర్వాత పుట్టిన ఇతర జీవుల కోసం ఆక్సిజన్‌‌ ఉత్పత్తిలో పెరుగుదల జరిగి ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ ఆక్సిజనేషన్​ ఈవెంట్‌‌కు ముందు వెస్ట్రన్‌‌ ఆస్ట్రేలియాలోని మౌంట్‌‌ మెకరేషేల్‌‌ నిర్మాణంలో కనిపించిన డ్రిల్‌‌ కోర్‌‌‌‌లు 2.5 బిలియన్‌‌ ఏండ్ల క్రితం ఉన్న జియోలాజికల్‌‌ కాలాన్ని కలిగి ఉండటం రీసెర్చర్స్‌‌ గమనించారు. అయితే వాతావరణ మార్పులను అనుసరించే జీవుల మనుగడ ఉంటుందని, కాని ఆక్సిజనేషన్ ఈవెంట్‌కు ముందు ఒక బిలియన్‌‌ సంవత్సరాల కంటే ముందు భూమిపై లైఫ్ ఎలా మొదలైంది? అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిందని అంటున్నారు. మెర్క్యూరీ ఎన్‌‌రిచ్‌‌మెంట్‌‌, ఆక్సిడేషన్‌‌ వెదరింగ్‌‌ రెండింటి సంకేతాలు, తర్వాత అగ్నిపర్వత పేలుళ్లలో బయటపడ్డ భాస్వరం ఇంకా న్యూట్రియెంట్‌‌ లాంగ్‌‌ టర్మ్‌‌ జీవ సంబంధ కార్యకలాపాలను మాడ్యులేట్‌‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. కానీ ఈ వాల్కానిక్‌‌ యాక్టివిటీస్‌‌ భూమిపై ఎక్కడ జరిగాయో స్పష్టత లేదని, అది ఇండియా, కెనడా ఇంకా ఇతర ప్రదేశాల మధ్య ప్రవహించిన లావా కారణంగా కూడా జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఆర్కియన్‌‌ అట్మాస్పియర్‌‌‌‌ వాతావరణ మార్పుల వల్ల ఫ్రెష్‌‌ బసాల్టిక్‌‌ రాక్‌‌ మెల్లి మెల్లిగా కరిగి, మాక్రోన్యూట్రియెంట్‌‌ పాస్పరస్‌‌ను నదుల్లోకి విడుదల చేస్తోందని, అది నిస్సార తీర ప్రాంతాల్లో నివసించే సూక్ష్మజీవులకు ఆహారం అందిస్తూ ఉత్పాదకతకు తోడ్పడే ఆక్సిజన్‌‌ స్పైక్‌‌గా పనిచేస్తోందని వాషింగ్టన్‌‌ యూనివర్సిటీ ఆస్ట్రోబయాలజిస్ట్‌‌ ఒకరు చెప్పారు. గత కొన్ని దశబ్దాలుగా సాలిడ్‌‌, నాన్‌‌ లివింగ్‌‌ ఎర్త్‌‌కి మధ్య కనెక్షన్లు ఉన్నాయని, వాటి గురించి తెలియాలంటే పరిశోధనలను మరింత విస్తృతం చేయాలని అన్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More