మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

ప్రపంచచరిత్రల్లో ఎన్నో మరణాలు ఇప్పటికి మిస్టరీ లు గానే ఉన్నాయి..చరిత్రల నుంచి హిట్లర్, బోస్, లాల్ బహదూర్ శాస్త్రి, అల్లూరి.., ఇలా ఎందరో మరణాలపై అనేక అనుమానాలు.. దశాబ్దాలుగా అవి అలానే ఎన్నో కధనాలకు ఊతం ఇస్తూనే ఉన్నాయి.. ఎలా చనిపోయారు.. చంపబడ్డారా… సహజమరణమా..? అసలు నిజం గా చనిపోయింది వాళ్లేనా..? అనుమానాలకు అంతే లేదు..

ఇప్పుడు మైకేల్ జాక్సన్ గురించి కూడా ఇలాంటి వార్తే మాధ్యమల్లో చక్కర్లు కొడుతోంది.. ఏభైఒక్క ఏళ్లకే మరణించిన మైకేల్ జాక్సన్ నిజానికి మరణించలేదని 65 ఏళ్ళ వయసులో మైఖేల్ జాక్సన్ ఇప్పుడు ఒక దగ్గర జీవిస్తున్నాడని.. ఆ విషయాన్ని స్వయంగా జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ వెల్లడించినట్లు గా ఓ వార్త వైరల్ గా మారింది..

కింగ్ ఆఫ్ పాప్ గా కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జాక్సన్ ఇంకా జీవించే వున్నాడు అన్న వార్త నిజానికి ఆసక్తి కరమే కాదు ఆనందదాయకం కూడా.. సంగీతానికి.. ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా వుంటున్నాడని రకరకాల కధనాలు వెలువడుతున్నాయి.. కొన్ని వెబ్సైట్లు, మరికొన్ని పేజీలు. జాక్సన్ ఎలైవ్ అనే పేరు తో నిర్వహిస్తూ అభిమానుల్లో కొత్తరకం ఆశలు రేకెత్తిస్తున్నారు..

అయితే ఇలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ ఆస్కారం ఇవ్వడానికి కారణం అతని మరణం మాదకద్రవ్యాల మత్తులో జరిగిన తర్వాత శవపేటిక ను తెరకపోవడం.., చివరి క్షణాల్లో ఆయన మృతదేహాన్ని అభిమానులకు చూసే హక్కు ను కల్పించకపోవడం తో జాక్సన్ మరణించలేదని వాళ్ళు బలంగా నమ్మడానికి ఓ కారణమైంది.
నిజానికి ఆయన శరీరం ఆ పేఠిక లో ఉందా..? అంత రహస్యంగా దాచాల్సిన అవసరం ఏంటి..?
శరీరం బాగా దెబ్బతిన్నప్పుడు లేదా చాలా హింసాత్మకంగా మరణించినప్పుడు లేదా కుళ్ళిపోతున్నప్పుడు మాత్రమే మృత శరీరం ప్రజల కళ్లకు కనిపించకుండా రహస్యంగా ఉంచుతారు , కానీ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవాన్ని ఎవరికి చూపించకుండా ఎందుకు చేశారు.. అన్నది ఇప్పుడు అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలు..
అతను ప్రశాంతంగా జీవించడానికి పారిపోయాడని అభిమానులు బలంగా విశ్వసిస్తున్న నేపధ్యంలో పారిస్ జాక్సన్ చేపుతున్నట్టు సర్క్యులేట్ అవుతున్న వైరల్ మెసేజ్ అభిమానుల్లో కొత్త శక్తి ని పుట్టించింది.

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్‌ను ప్రపంచం కోల్పోయి పదిహేను సంవత్సరాలు దాటిపోయింది. ఇలాంటి వార్త ఇప్పుడే వస్తున్నది కాదు కొన్ని సంవత్సరాల క్రితం కూడా వినిపించింది.. “మైఖేల్ జాక్సన్” పేరుతో ఓ వ్యక్తి గుర్తు తెలియని ప్రదేశంలో ఒక పేవ్‌మెంట్‌పై చేసిన డాన్స్ ను కొందరు సోషల్ మీడియాలలో అప్లోడ్ చేస్తే మిలియన్ వ్యూస్ దక్కించుకుని అభిమానుల్లో పాత అనుమానాలను రాజేసింది. చనిపోయాడా.. బ్రతికే ఉన్నాడా..? అన్న చర్చ కు దారితీసింది.. కొన్నాళ్ళు స్తబ్దు గా ఈ అంశం ఇన్నాళ్ళకి మళ్ళీ ఊపిరి పోయానుకుంది.. అరవై ఐదేళ్ళ వయసు లో మైకేల్ జాక్సన్ ఇలా.. అంటూ ఓ ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా పాప్ కింగ్ సజీవం గా ఉన్నాడన్న ఊహ మాత్రం అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందని అభిమానులు అంటున్నారు..

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

‘అన్‌స్టాపబుల్ కి మరోసారి గెస్టుగా ఏపీ సీఎం

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More