అక్కడ నీరసం… ఇక్కడ నీరాజనం.. బీజేపీ పాదయాత్రల ప్రహసనం

కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాష్ట్రాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న లక్ష్యం తోనే పావులు కదుపుతోంది.. అయితే అధికారాన్ని లాక్కోవడమో.. లేకపోతే అనుకూలప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడమో చేసే మైండ్ గేమ్ ను స్పీడప్ చేసింది. దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటక తర్వాత హోప్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణా. అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నమే మొదలుపెట్టింది.ప్రజా సంగ్రామయాత్ర పేరిట మూడో విడత పాదయాత్ర ను భారీగా మొదలుపెట్టింది కేంద్ర మంత్రుల భాగస్వామ్యం తో జన నీరాజనాలతో సాగుతుండగా అదే సమయం తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ మనం.. మన అమరావతి సంకల్ప పాదయాత్ర పేరు తో అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులు పై 29 గ్రామాల్లో వారంపాటు పాదయాత్ర ను ప్రారంభించారు.. తెలంగాణ లో కదం తొక్కుతున్న పాదయాత్ర ఇక్కడ నీరసం గా , రైతుల నిలదీతలతో.. ఏదో మొక్కుబడి గా సాగుతోంది.. అటు తెలంగాణా లో కేంద్ర మంత్రుల పర్యటనలు రాష్ట్ర నేతల హడావుడి మొత్తానికి యాత్ర ధూమ్ ధామ్ గా సాగుతోంది.. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రానుండడం తో పార్టీ లోకి ఆ వేదిక పై భారీ చేరికలు వుంటాయని కూడా భావిస్తున్నారు.. దానికి తోడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ కి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఎన్నిక ద్వారా బీజేపీ గతంలో హుజురాబాద్ తరహా లో అధికార టీఆరెస్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని తహతహ లాడుతోంది.. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న యాత్ర ముగింపు సభ కూడా అంతే నీరసంగా జరిగే అవకాశం ఉంది పార్టీ కార్యదర్శి సత్య మాత్రమే ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి హాజరుకానున్నారు.. ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పినట్టు మోదీ కొడుకుల చూసుకునే జగన్ ప్రభుత్వాన్ని ఎక్కువగా డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేకనే పాదయాత్ర కూడా లైట్ గానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని భాజాపా వ్యతిరేక పార్టీలు విమర్శిస్తున్నాయి.. కనీసం ప్రజలలో పట్టువున్న నాయకులను రంగంలోకి దించిన కొద్దిగా పరువైన ఉండేదని కొంతమంది అంటున్నారు.. గతం లో అమరావతి రైతులపై నోరు పారేసుకున్న బీజేపీ నేతల ప్రస్తావన ను కూడా ఇప్పటి పాదయాత్ర లో గుర్తుచేస్తూ నిలదీయడం బీజేపీ కి మింగుడు పడటం లేదు. ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో కూడా తెలియరావడం లేదు.. మీడియా డిస్కషన్స్ లో కూర్చుంటున్న బీజేపీ నాయకులు అక్కడి ప్యానెల్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాని యాంకర్ అడిగిన ప్రశ్న కు గాని సమాధానం ఇవ్వలేక నీళ్లు నములుతూ ఆవు వ్యాసం లాగా మోడీ గొప్పతనం వర్ణించే పని లో పడిపోతున్నారు. ఇదిలా ఉంటె బీజేపీ కి మిత్రపక్షంఅని చెపుతున్న జనసేన జెండాలు మాత్రం ఈ పాదయాత్ర లో ఒక్కటి కూడా ఎగరడం లేదు.. తెలంగాణ లో బీజేపీ కి నాయకులు వున్నారు కొద్ధోగొప్పో కేడరూ ఉంది.. ఆంధ్రాలో కేవలం నాయకులు మాత్రమే వున్నారు కేడరూ లేరు.. ప్రజల మద్దతూ లేదు

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More