లక్ష సిసి కెమెరాల దృశ్యాలను ఒకేసారి చూడొచ్చు..

కేవలం హైదరాబాద్ నగరంలో ని దృశ్యాలనే కాదు రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల లక్ష సిసి కెమెరా దృశ్యాలను ఒకే సారి చూసే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో నిర్మితమైన ఈ కంట్రోల్ సెంటర్ పరిధి లోకి తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ లోకి వస్తుంది.కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ, బెల్జియం నుంచి దిగుమతి చెసుకున్నారు.. దీన్నుంచి సేవలు ప్రారంభమైతే.. సిటీలోని అన్ని సీసీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటుచేశారు.. 585 కోట్ల భారీ వ్యయంతో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు.. మొదట్లో 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా.. తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు. ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ బీ సీ డీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్-బీ సీ డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-ఏ. హెలిప్యాడ్ తో కలిపి జీ ప్లస్ 20 అం తస్తుల్లో టవర్-ఏ నిర్మించారు. ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు ఉంటాయి. గతంలోనే దీన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. పనులు పూర్తి కాకపోవడంతో.. వాయిదా పడింది. 2015లో కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు పనులు సాగాయి. వాస్తవానికి ముందుగానే పనులు పూర్తి కావాల్సింది. కానీ.. కరోనాతో రెండేళ్లు పనులు ఆగిపోయాయి. షాపూర్ జీ పల్లోంజి కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేపట్టింది. ఈ ఒక్క బిల్డింగ్ అందుబాటులోకి వస్తే .. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టవచ్చు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More