ఎంపీ గోరంట్ల ని టార్గెట్ చేశారా…?

తెలుగు రాష్ట్రాలల్లో మీడియా కు మరో సమస్య లేదు.. కనిపించడం లేదు.. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు ప్రధాన ఎజెండా. లీకైన వీడియోలో ఓ మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడుతున్న వీడియోకాల్ ని వైరల్ చేశారు ఇదే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. గోరంట్ల వీడియో వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా.. అధికార వైసీపీ నేతలు కొంత మంది సైలెంట్ గా మరికొంతమంది ఆఫ్ ది రికార్డ్ వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. వీడియోపై దైర్యంగా ఏమి మాట్లాడలేని దుస్థితిలో వైసీపీ నేతలు పడిపోయారు. ఎంపీ గోరంట్ల మాత్రం తనపై టీడీపీ నేతలు కుట్ర చేశారని అంటున్నప్పటికీ ఇందులో మరికొన్ని కోణాలున్నాయని అనుమానిస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. గోరంట్ల తాజా ఎపిసోడ్ తో గతంలో వైసీపీ నేతలకు సంబంధించి బయటికి వచ్చిన రాసలీలల ఘటనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో మంత్రి గా ఉన్న అవంతి ఓ మహిళతో మాట్లాడిన ఫోన్ కాల్, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సంబంధించి చాలా సార్లు లీకయిన ఆడియో కాల్స్ . థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి పవిత్రమైన ఎస్వీబీసీ చైర్మెన్ హోదా ఉంటూ చేసిన రాసలీలల వ్యవహారం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. అంబటి రాంబాబుకు సంబంధించి 2021 ఆగస్టులో ఓ ఆడియో కాల్ బయటికి వచ్చింది. అంబటి రాంబాబు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని అప్పట్లో చెప్పారు. గతంలోనూ తనపై ఇలాంటే కుట్రలే జరిగాయన్నారు. ఇటీవలే సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత లక్ష్మిపార్వతితో అనుచితంగా మాట్లాడిన ఆడియో కూడా కలకలం రేపింది. అయితే ఆ ఆడియోపై అంబటి స్పందించలేదు. దీంతో వాయిస్ అయనదేనని అంతా భావించారు. గతంలోనూ ప్రజారాజ్యం పార్టీకి చెందిన సంజన అనే మహిళా కార్యకర్తతో హాస్కి వాయిస్ తో అంబటి రాంబాబు మాట్లాడిన ఆడియో కూడా పెను సంచలనమై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. అప్పుడు ఆ మాటలు తనవేనని అంబటి రాంబాబు ఒప్పుకున్నారు. కాని ఉద్దేశపూర్వకంగా అలా చేశారని ఆరోపించారు. అలాగే వైసీపీ నేత, నటుడు పృథ్వీ కూడా రాసలీలల వ్యవహారంలో అడ్డంగా బుక్కై ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కోల్పోయాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే పృధ్వీ ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఓ మహిళను వెనక నుంచి వాటేసుకున్న ఉదంతం బయటికి వచ్చి గట్టి దుమారాన్నే రేపింది. వైసీపీ పెద్దలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్వీబీసీ చైర్మెన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. ఇప్పుడు గోరంట్ల పై కూడా ఏ క్షణానైన సస్పెన్షన్ వేటు పడొచ్చని వార్తలొస్తున్నాయి.. అప్పుడు పృథ్వి పై ఇప్పుడు గోరంట్ల పై సీరియస్ అయిన అధిష్టానం అవంతి పై గాని అంబటి పై గాని ఇంత తీవ్రంగా స్పందించక పోవడం తో స్వపక్షం లొనే కుట్ర జరిగిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.. థర్టీ ఇయర్స్ పృద్వి అయితే తనపై కుట్ర జరిగిందని కావాలని తప్పించేందుకు ఆ లీకు కు తెర తీశారని చెప్పేసారు కూడా.. తాజాగా గోరంట్ల వ్య‌వ‌హారంతో ఇర‌కాటంలో ప‌డిన వైసీపీ సజ్జల ద్వారా కౌంటర్ ఇచ్చింది.. వీడియో నిజమని తేలితే చర్యలుంటాయని వెల్లగొట్టడాన్ని దాదాపు గా కన్ఫర్మ్ చేసేసారు. గతంలో పృధ్వి వ్యవహారం వెలుగులోనికి రాగానే యాక్షన్ తీసుకుంది వైసీపీ సర్కార్. కాని అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు విషయంలోనూ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అంబటి రాంబాబుకు మంత్రిగా ప్రమోషన్ వచ్చింది.ఇప్పుడు న్యూడ్ వీడియో కాల్ తో అడ్డంగా దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ చర్య తీసుకుంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. పృథ్వి, గోరంట్ల ఇద్దరూ ఏక్సిడెంటల్ పొలిటీషియన్సే కాబట్టే వెంటవెంటనే ఉద్వాసన కు గురయ్యారని సీరియస్ పొలిటీషియన్స్ కాబట్టే ప్రజల్లో ఇబ్బందులు వస్తాయని పార్టీ లెక్కసిందని కొందరు అంటున్నారు. మాధ‌వ్‌ అంటున్నట్టు కుట్ర జరిగిందన్నది వాస్తవం అది స్వపక్షం లోనా విపక్షం లోనా అన్నదే ఫైనల్ గా తేలాల్సింది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More