సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ ఆటలు కట్టిస్తున్న భారత్ కు చైనాను నిలువరించడం మాత్రం పెద్ద సమస్యగా మారింది. సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా కుయుక్తులు పన్నుతుంది. గతంలో కూడా ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే భారత్ సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని భావించింది. అందుకు అంగీకరించి ఒకపక్క చర్చలు జరుపుతూనే మరో పక్క అక్రమాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా అన్ని విధాలుగా సన్నద్ధం గా ఉంది ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే చైనా ముందుగా భారత్ పై యుద్ధ విమానాలతో లేదా క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ దాడిని దీటుగా ఎదుర్కోవాలంటే ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని భావించిన భారత్ రష్యా నుంచి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడత క్షిపణి వ్యవస్థ ఇప్పటికే భారత్ చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ప్రకారం ఈ వ్యవస్థను పూర్తిగా భారత్ కు అప్పగించేందుకు సంసిద్ధంగా ఉంది. తూర్పు లడాఖ్ లో సరిహద్దుల వద్ద చైనా యుద్ధ విమానాలు కవ్వింపు చర్యలు ఎక్కువైన వేళ ఈ వ్యవస్థను చైనా సరిహద్దుల్లో మోహరించాలని భావిస్తుంది. మరో మూడు నెలల్లో మోహరింపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న రెండవ ఎస్- 400 క్షిపణి వ్యవస్థను చైనా తో సరిహద్దులు కలిగి ఉన్న పశ్చిమ ప్రాంతంలోను కూడా మోహరించాలని భావిస్తుంది. వాస్తవ దీన రేఖ వద్ద ఇరువైపులా పది కిలోమీటర్ల వరకు నో ప్లైన్ జోన్ గా ఉంది. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తూ చైనా యుద్ధ విమానాలు ఈ జోన్ లోకి తరుచుగా వస్తున్నాయి. చాలా ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో శత్రువుతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఎస్-400 క్షిపణి వ్యవస్థను చైనా సరిహద్దుల్లో వ్యవహరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థకు శత్రువు యుద్ధ విమానాలు, డ్రోన్ లు, క్షిపణులను కూల్చగలిగే సామర్థ్యం ఉంటుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఎస్ -400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు మాత్రం అమెరికా మినహాయింపు ఇచ్చింది. అయితే తొలుత భారత్ ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించేందుకు కూడా సిద్ధమైంది.అయితే 2017 లొనే ఎస్-400 కొనుగోలు ఒప్పందం కుదరడం, శత్రు దేశాల నుంచి ముప్పు ఉన్న దృష్ట్యా అలాగే జాతీయ భద్రతా దృష్ట్యా వ్యవస్థ భారత్ కు ఈ వ్యవస్థ చాలా ముఖ్యమైనదని అమెరికాకు భారత్ చెప్పింది. దీంతో ఈ ఆంక్షలు నుంచి భారత్ కు మినహాయింపు లభించింది. మొత్తంగా రష్యా నుంచి అయిదు ఎస్- 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 40 వేల కోట్ల రూపాయలతో భారత్ ఒప్పందం చేసుకుంది. 2023 చివరికల్లా ఈ క్షిపణి వ్యవస్థలు పూర్తిగా భారత్ కు చేరనున్నాయి. ఒక్కో క్షిపణి వ్యవస్థలో రెండు మిస్సైల్ బ్యాటరీలు ఉంటాయి. ఒక్కో మిస్సైల్ బ్యాటరీ లో 128 చొప్పున క్షిపణులు ఉంటాయి. భారత్ భూభాగం వైపు దూసుకు వచ్చే ముప్పును 120 నుంచి 380 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించి వాటిని నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి వ్యవస్థకు ఉంది.