ఇకపై షర్మిల కాంగ్రెస్ నాయకురాలు.?

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని షర్మిల విలీనం చేయడం దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ తెలంగాణ లొనే కాదు ఏపీ రాజకీయాలలో కూడా మరింత చర్చ ను రాజేసింది.. తన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పూర్తిస్థాయి హామీ ఇవ్వడం తోనే పార్టీ విలీన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు వరకు ఏపీలో తన అన్న జగన్ మోహన్ రెడ్డితో కలిసి వైసిపికి ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా తను ఒక కీలక పాత్ర పోషించింది. అనంతరం వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆమె తల్లితో సహా తెలంగాణ చేరుకుని సొంత రాజకీయ వేదిక తో ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది.

అయితే ఇప్పటికే అక్కడ బిజెపి బలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త పుంజుకుంది. ఆమె సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆంధ్రా వాళ్ల రాజకీయాలు తెలంగాణలో సాగవు అంటూ అక్కడ నేతలే షర్మిలకు కౌంటర్ ఇస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తున్నారు. మరోపక్క తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై అప్పుడప్పుడు సమావేశాలలోనూ, ప్రెస్మీట్లోనూ చురకలాంటిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైనప్పటికి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్నారు ఏపీ లో చిరంజీవి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూసింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తే రెండు రాష్ట్రాలలో చిరంజీవి వలన పార్టీ కొత్త నిలబడుతుందని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా భావించింది. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల మాత్రమే సరైన వ్యక్తని భావించిన కాంగ్రెస్ ఆమె తో చర్చలకు తెరతీసింది.. ఆమె భవిష్యత్ పై పూర్తి భరోసా ఇవ్వడంతో తన పార్టీని విలీనం చేసేందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక నుంచి రాజ్యసభ హామీ ఇవ్వటంతో షర్మిల అంగీకరించారని, తన మద్దతు దారులకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పాలేరు అసెంబ్లీ నుంచి తనకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అన్నింటిపైన తుది ఆమోదం లభించగానే రాహుల్ తో ఫైనల్ చర్చల తరువాత సోనియా సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం చేసేలా కార్యచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం. అటు షర్మిలను తెలంగాణకు తీసుకురావడం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసారని సమాచారం ఆమె రాక పార్టీకి నష్టం చేస్తుందని హైకమాండ్ వద్ద వాదించినట్టు తెలిసింది.దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ నేతలు షర్మిల వ్యవహారం పై ఆచితూచి మాట్లాడాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఆమెకి కాంగ్రెస్ పార్టీ అంత ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయాల తర్వాత కేంద్ర అధిష్టానం కూడా సమాలోచనలో పడింది. వచ్చే ఎన్నికలలో ఏపీ నుంచి షర్మిల పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల తోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ లో పార్టీ విలీనం పైన వైఎస్సార్టీపీ నేతలు షర్మిల నుంచి స్పష్టత కోరిన నేపథ్యంలో షర్మిల కూడా క్లారిటీ ఇచ్చారు. వేదిక ఏదైనా వైఎస్ఆర్‌ సంక్షేమ పాలనే తన లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న పార్టీ నాయకులు అధైర్య పడాల్సిన పనిలేదని, అందరికీ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ తనను నమ్ముకున్న వారిని అన్ని వేళలా కాపాడుకున్నారని, ఆయన బిడ్డగా తాను కూడా నమ్మకున్న వారికి న్యాయం చేసే తీరుతానని స్పష్టం చేశారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More