డీ మానిటైజేషన్ తర్వాత చెల్లింపుల విధానమే పూర్తిగా మారిపోయింది.. పే టీఎమ్,గూగుల్ పే, ఫోన్‌పే ఆఖరికి అమెజాన్ వాట్సాప్ వంటి సంస్ధలు పేమెంట్స్ యాప్ లు గా రంగంలోకి దిగి లావాదేవీలను ఈజీ చేసేసాయి.. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ పేమెంట్స్ అమల్లోకి వచ్చిన తర్వాత జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే వారి సంఖ్య చాలా తగ్గిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది అవన్నీ యూపీఐ Unified Payments Interface సపోర్ట్ తో నడిచే థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పుడు వాటికి సవాల్ విసురుతూ యూపీఐ ప్లగిన్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.దీని ద్వారాఎలాంటి పేమెంట్ యాప్స్ అవసరం లేకుండా సులభంగా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే పేమెంట్స్ చేసేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం ఇక ఉండదు.దీనినే మర్చంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ అని కూడా పిలుస్తారు. ఇది కస్టమర్లకు ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.మొబైల్ నంబర్ తెలిస్తే చాలు డబ్బులు పంపించేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు యాప్స్‌కు టెక్నాలజీ సరికొత్త సవాళ్లు విసురుతోంది.యూపీఐ చెల్లింపుల్లో వస్తున్న ఈ కొత్త యూపీఐ ప్లగిన్ ఆవిష్కరణ ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పే వంటి దిగ్గజ డిజిటల్ పేమెంట్ సంస్థల్లో కొత్త భయం పుట్టిస్తోంది. కొత్త ఫీచర్‌తో థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని,సులభంగా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఈ యాప్ వినియోగదారులకు చాలా ప్రయోజనకారిగా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు..