పుట్టెడు ఓటమి భారంతో వున్న రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ సీపీ వ్యవస్థాపక సభ్యుడు విజయసాయిరెడ్డి పై సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త చేసిన తీవ్ర ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే అరాచకాలు సృష్టించి వైసిపి కార్యకర్తలను , సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఈ తాటాకు చప్పట్లు భయపడేది లేదన్నారు.. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని త్వరలోనే ఒక న్యూస్ ఛానల్, పేపర్ పెట్టనున్నట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలు దిగజారిచే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా అని అన్నారు తనని ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్స్… టీవీ ఛానల్స్ పై హ్యూమన్ రైట్స్, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్, ట్రైబల్ కమిషన్ ,పార్లమెంటు ల దృష్టి కి తీసుకుని వెళ్లనున్నట్లు చెప్పారు.. తండ్రి వయసున్న నాకే ఒక ఆదివాసి మహిళతో సంబంధం అంటగడతారా అని ప్రశ్నించారు పార్లమెంట్ లో మహా న్యూస్ వంశీకృష్ణ , abn రాధాకృష్ణ, వెంకట కృష్ణ, టీవీ5 బీ ఆర్ నాయుడు ల పై ప్రివిలేజ్ మోషన్ వేస్తానని తెలిపారు..
ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే దాన్ని మీడియాకు ఎలా లీకు చేస్తారని ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని కుట్ర వెనుక ఎవరెవరు వున్నారో బయటకు చెప్పారు. .. తను పెట్టబోయే ఛానెల్,పేపర్ ఒకే కులం ఉన్న మీడియా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని వివరించారు.. ఇదిలా ఉండగా వైసీపీ తరఫున సాక్షి ఛానల్ పేపర్ వుండగా మళ్ళీ విజయసాయిరెడ్డి ఇంకొకటి పెడతానని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది . సాక్షి విజయసాయిరెడ్డి కి సపోర్ట్ చెయ్యకూడదను కుంటుందా..? లేక సాక్షి సహకారాన్ని విజయసాయిరెడ్డి వద్దనుకుంటున్నాడా..? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు..