కిరణ్ అబ్బవరం “క” సినిమా టీజర్ లాంఛ్

కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శక ద్వయం సుజీత్, సందీప్ ‌రూపొందిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ “క”. టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.


హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంటా. వీడి పని అయిపోయింది అని ఎవరైనా అంటే నమ్మకండి. ఎందుకంటే మన పని అయిందా కాదా అనేది మనకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయిందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయింది అనిపించినప్పుడు సినిమాలు చేయను. నేను చాలా మంచి సినిమాలు చేస్తాను. నన్ను ప్రేమించిన మీ అందరి కోసం చేస్తాను. ఏ యంగ్ యాక్టర్ కు ఇవ్వనంత లవ్ నాకు మీరంతా ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను. మా టీమ్ అంతా “క” సినిమాకు నేను పడిన కష్టాన్ని చెప్పారు. “క” సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. “క” అంటే కంటెంట్. ఆ కంటెంట్ ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. ఈ కథ విన్నప్పుడు వారు నాకొక మంచి ఆడియెన్స్ లా కనిపించారు. ఆడియెన్స్ దృష్టితోనే వారు కథను రాసినట్లు అనిపించింది. ఇప్పుడున్న టికెట్ రేట్స్, కాంపిటేషన్ లో ఎంతమంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది మా డైరెక్టర్స్ ఆలోచించారు. . “క” తో ఒక మంచి మూవీ మీకు ఇవ్వబోతున్నా. మళ్లీ మీ ప్రేమ పొందేందుకు వేచి చూస్తునన్నారు.
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ – మాకు “క” సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం రావడానికి మొదటి కారణం శ్రీధర్. ఆయన ఎస్ ఆర్ కళ్యాణమండపం డైరెక్టర్. మేము చెప్పిన కథ విని కిరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ మూవీ ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతో ఉంది. ఏ కథనైనా తెరపైకి తీసుకొచ్చేందుకు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది కిరణ్ గారు. ఆయన మాకు మంచి రిసోర్సెస్, యంగ్ టాలెంటెడ్ టీమ్ ఇచ్చారు. మాలాంటి కొత్త డైరెక్టర్స్ కు ఇలాంటి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మరో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ఈ కథను యాక్సెప్ట్ చేసేందుకు గట్స్ కావాలి. పీరియాడిక్ డ్రామా, నాన్ లీనియర్ లో స్క్రీన్ ప్లే వెళ్తుంది. ఈ కథను నమ్మి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన హీరో కిరణ్ గారికి థ్యాంక్స్. చాలా ఎఫర్ట్స్ తో కూడుకున్న సినిమా ఇది. రీసెర్చ్ చేసి, 80ల నాటి వస్తువులు సేకరించి, క్రియేట్ చేసే హై స్టాండర్డ్స్ లో “క” సినిమాను రూపొందించాం. “క” అంటే కిరణ్ అబ్బవరం అని అంతా అనుకుంటున్నారు కానీ “క” అంటే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూస్తారు. అన్నారు. నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి , నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ,డైరెక్టర్ సతీశ్ వేగేశ్న కో ప్రొడ్యూసర్ వినీషా రెడ్డి ,ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ , ఎడిటర్ శ్రీ వరప్రసాద్, డీవోపీ విశ్వాస్ డేనియల్ , డీవోపీ సతీష్ రెడ్డి , క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చవన్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More