సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ పై సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పించాలని లేకుంటే సహకరించేది లేదని సభా ముఖంగా తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండీషన్ కి సినీ పెద్దలు రెస్పాండ్ అయ్యారు.. టిక్కెట్లు పెంచమని మాత్రమే వస్తున్నారని సైబర్ నేరాలపై, డ్రగ్స్ పై అవగాహన కల్పించే విధంగా ప్రకటనలు రూపొందించాలని అలా చేయకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వుండవని సున్నితంగానే హెచ్చరించారు. పనిలో పనిగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా తమవంతుగా భాగం పంచుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు లోగడ ఇటువంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందని గుర్తు చేస్తూ సీఎం చేసిన పాటిస్తామంటూ o లేఖ విడుదల చేసారు.. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని గతంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయములు పై సానుకూలంగా స్పందించిన విషయం కూడా ఇందులో పొందు పరిచారు.త్వరలో ముఖ్యమంత్రి ని కలవనున్నట్లు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ ఇందులో ప్రకటించారు..