ఆర్జీవి వ్యూహం టీజర్ వచ్చేసింది. టీజర్ లో ఏం చూపించాడనే దాని కోసం అందరూ ఆత్రుతగా చూడటం మొదలు పెట్టారు. ఆర్జీవి తన రెగ్యులర్ మార్కుతో ఉండేవిధంగా ఈ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో తమిళనాడు నటుడు అజ్మల్ , మానస ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడీ టీజర్ కూడా ఒక సంచలనంగా మారింది ఎందుకంటే, అవి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్రలు ఈ టీజర్ లో ఉన్నాయి. సీఎం జగన్‌గా అజ్మల్ నటిస్తుంటే, భారతి క్యారెక్టర్‌ను మానస పోషిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పరిణామాలను రెండు నిమిషాల 46 సెకండ్ల నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, భారతి క్యారెక్టర్ లు హైలెట్ గా నిలిచాయి. “అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు ” అనే జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ తో చెప్పించే డైలాగ్ తో ఈ టీజర్ ముగుస్తుంది. ఆర్జీవి వ్యూహం పేరుతో కొత్త సినిమాను అనౌన్స్‌చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఏపీ పాలిటిక్స్‌లో వ్యూహం తో హీట్ పెంచిన ఆర్జీవీ వైసీపీ ప్రత్యర్ధులపై సెటైరికల్‌గా సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే రామ్‌గోపాల్‌వర్మ ఈ సినిమాను మొత్తం సెటైర్లతో నింపేసే అవకాశం కనిపిస్తోంది. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు ఎంత వివాదం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకుమించి సంచలనం కాబోతోంది వ్యూహం మూవీ. వర్మ మాటలను డీకోడ్ చేస్తే అది క్లియర్‌గా తెలుస్తోంది. ఆర్జీవి పేరు పెద్ద కాంట్రవర్సీ, ఎప్పుడేం చేస్తాడో, ఏమంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీ లేపవడం వర్మ స్టైల్. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా ఒకవైపు ఉంటే, ఆర్జీవీ ఒక్కడే ఇంకోవైపు ఉంటాడు. అయినా, అందరూ చేసేదే ఆర్జీవీ చేస్తే ఆయన రాంగోపాలవర్మ ఎందుకవుతారు? పొగరనుకున్నా, తెగువనుకున్నా డోంట్ కేర్ అనే వర్మ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వ్యూహం టీజర్ తో కల్లోలం రేపారు. సినిమాలోని క్యారెక్టర్స్‌తోపాటు స్టోరీ లైన్ కూడా ముందే చెప్పేశారు వర్మ. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం అంటూ మూవీ ఎలా ఉండబోతోందో ముందే హింట్ ఇచ్చారు. ఆర్జీవీ అనౌన్స్ చేసిన వ్యూహం మూవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతోంది