తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వ విఖ్యాతం చేసిన మహానటుడు.. ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం వందరూపాయిల నాణెం విడుదల చేయనున్నట్టు చేసిన ప్రకటన తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా శుభవార్తే.. అయితే ఈ నాణెం రెగ్యులర్ గా చెలామణి లో ఉండేది కాదు.. ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో విశేష సందర్భాల్లో, ఆయా వ్యక్తుల సంస్మరణ నిమిత్తం ఇటువంటి నాణేల్ని రిజర్వ్ బ్యాంకు విడుదల చేస్తుంది. లీగల్ టెండర్ లేని అంటే అధికారికంగా చెలామణీ కాని నాణేలు అంటే ఇతర నాణేల్లాగా మార్కెట్‌లో చెల్లుబాటు కాదు… వీటిని కమెమరేటివ్ కాయిన్స్ అని వ్యవహరిస్తుంటారు. కాయిన్స్ లాగే ఫిలాటలీ స్టాంప్స్ కూడా ఆయా ప్రముఖుల పేరిట విడుదల చేస్తుంటారు. ప్రస్తుతఆర్బీఐ నాణేల్లో లీగల్ టెండర్ ఉన్నవి.50 పైసలు, 1, 2, 5, 10, 20 రూపాయల కాయిన్స్ మాత్రమే.. అయితే మార్కెట్‌లో 20 రూపాయల నాణేలు ప్రస్తుతం చెలామణి లో లేవు అలాగే యాభై పైసల్లోపు నాణేలు అధికారికంగా రిజర్వ్ బ్యాంకు ఆమోదం ఉన్నప్పటికీ తీసుకునేవారే లేరు.. పదిరూపాయిల కాయిన్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్సెప్ట్ చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో వీటిని చెల్లవంటున్నారు 10 రూపాయల కాయిన్‌ను రకరకాల డిజైన్లలో రిలీజ్ చేసినందున చాలామంది వాటినీ యాక్సెప్ట్ చేయడం లేదు, కానీ అది తప్పు… కమెమరేటివ్ కాయిన్స్ సంగతికొస్తే ఆసక్తి కలిగిన వాళ్లు.. స్టాంప్ అండ్ కాయిన్స్ సేకరణ కర్తలు వీటిని కొనుగోలు చేస్తుంటారు.. వీటిని ఆర్బీఐ మింట్ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు… 50, 75, 100, 125, 150, 200, 1000 వరకూ అంకెల వరకు ముద్రించే ఇవి నాణం లా ఉండే నమూనా స్మారకచిహ్నం మాత్రమే.. ఒక్కో కాయిన్ వాటిపై ముద్రించే విలువ కాకుండా వేరు వేరు రేట్లు నిర్ణయిస్తుంది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా. ఆ విధంగా ఎన్టీఆర్ పేరిట విడుదల చేయనున్న వంద రూపాయల కాయిన్ ధర 4,160… ఎన్టీయార్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతిపరులు కాయిన్ కలెక్టర్లు రేటు గురించి ఆలోచించకుండా వీటిని కొనుగోలు చేస్తారు. ఇది 50 శాతం వెండి.., 40 శాతం రాగి, మిగిలిన పది శాతం జింక్, నికెల్ తో ఈ కాయిన్ రూపొందుతుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్ బీ ఐ కొత్తగా విడుదల చేస్తున్న ఎన్టీఆర్ నాణెం ఎదో మొక్కుబడిగా కొంతమందినే సంతృప్తి పరిచే కమామరేటివ్ కాయిన్ గా కాకుండా రెగ్యులర్ చెలామణి లో ఉన్న నాణెం గా విడుదల చేసుంటే చాలా బావుండేదని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు..