నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ 24 ఓట్ల తేడాతో గెలుపొందారు. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రాగా జెమిని కిరణ్ 315 ఓట్లు వచ్చాయి.. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా గౌరవ కార్యదర్శి పదవికి పోటీపడ్డ వైవిఎస్ చౌదరి 362 దక్కించుకోగా ప్రసన్న కుమార్ 378 ఓట్లు పొంది 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి, నట్టి కుమార్ ఎన్నికయ్యారు.నిర్మాతల మండలి మొత్తం సభ్యుల సంఖ్య 1134 కాగా 677 ఓట్లు పొలయ్యాయి.. ఈ ఎన్నికలకు మొత్తం అన్నిపోస్టులకి కలిపి 69 నామినేషన్ లు దాఖలు కాగా ఏడు నామినేషన్ లు చెల్లకుండాపోయాయి తరువాత ఉప సంహరణ అనంతరం 42 మంది వివిధ పోస్టు లకు బరిలో నిలవగా ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఎన్నికలో కార్యనిర్వాహక సభ్యులు గా దిల్ రాజు , దానయ్య, రవి కిషోర్ , యలమంచిలి రవి , పద్మిని , బెక్కం వేణుగోపాల్ , సురేందర్ రెడ్డి , గోపీనాథ్ ఆచంట , మధుసూదన్ రెడ్డి , కేశవరావు , శ్రీనివాస్ వజ్జ , అభిషేక్ అగర్వాల్ , కృష్ణ తోట , రామకృష్ణ గౌడ్ , కిషోర్ పూసలు విజయం సాధించారు.గెలిచారు.