పవన్ కళ్యాణ్ కి 64.26 కోట్ల అప్పు

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తానకు 64కోట్ల 26 లక్షల అప్పు ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు.. గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు ఇందులో పొందుపరిచారు.. గత ఐదేళ్ళలో తన ఆదాయం 114,76,78,300 రూపాయలు పేర్కొంటూ ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా 47,07,32,875, రూపాయలు జీఎస్టీకి మరో 26,84,70,000 రూపాయలు చెల్లించినట్లు నామినేషన్ అఫిడవిట్ లో లెక్కలు చూపించారు. అలాగే తనకు64,26,84,453 రూపాయల అప్పు ఉందని ఇందులో వివిధ బ్యాంకుల నుంచి 17,56,84,453 రూపాయలు, కొందరు వ్యక్తుల నుంచి 46 కోట్ల 70 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అందులో వివరించారు. అదేవిధంగా 20 కోట్లకు పైగా వివిధ సంస్థలకు విరాళాలు గా ఇచ్చారని పేర్కొన్నారు.. జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఇందులో జనసేనకు రూ.17,15,00,000 పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు అందించారు.. వీటితోపాటు వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందజేయగా వాటిల్లో కేంద్రీయ సైనిక్ బోర్డు – రూ.1 కోటి పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – 1 కోటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కి 50 లక్షలు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ 30,11,717 పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ 2 లక్షలువిరాళాలు గా ఇచ్చినట్లు అఫిడవిట్ లో వివరించారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More