‘హనుమాన్’ వంద రోజుల పండగ

హనుమాన్ విజయోత్సవం(హనుమాన్ జయంతి) రోజునే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్ ని నిర్వహించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలోనే వంద రోజుల వేడుక కూడా చేస్తామని నిర్మాత అన్న మాటని ప్రేక్షకులు నిజం చేశారని చెప్పారు.. ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటానన్నారు.. జైహనుమాన్ ని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ ,కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తేజా సజ్జా మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుందని ‘ఈ జనరేష్ లో వంద రోజులు వున్నది నీకే’ ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా వంద రోజులు కాదు మీ అందరి వంద రోజులు అని చెప్పారు. విలక్షణ నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా వుంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ వుండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది. విభీషునిడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం వుండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంతనమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ వర్మ కి సభాముఖంగాధన్యవాదాలు తెలిపారు..నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… దర్శకుడు ప్రశాంత్ మేము ఈ మూడేళ్ళగా నమ్మినది సాధించాం. మా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More