ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు. తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ అతిధి గృహాన్ని కేటాయించారు. అలాగే, సచివాలయంలో గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది. ఇప్పుడు పవన్‌తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా రెండో బ్లాక్‌లో మొదటి అంతస్తులో కేటాయించారు. ఇప్పటికే ఈ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్ వద్ద ఉండటంతో, పవన్ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న నేపథ్యంలో రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఆయన తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. సచివాలయంలో తన ఛాంబర్‌ను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసారు.. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి ప్రభుత్వం కేటాయించింది ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.