తేజ చేతుల మీదుగాపోలీస్ వారి హెచ్చరికటైటిల్ ఆవిష్కరణ

దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై
బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ ను
డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు…. ఈ సందర్భంగా దర్శకుడు తేజ
మాట్లాడుతూ ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని …ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటి
శక్తివంతమైన మాస్ టైటిల్ అని ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా మారి విజయాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు….!
విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్
దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్థన్
పేర్కొన్నారు…. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు…

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More