పేపర్ కప్పు… ప్రాణానికి ముప్పు..

ఒక్క హైదరాబాద్ లోనే లక్షకు పైగా ఉన్న మధ్య, చిన్న తరహా టీ సెంటర్లలో కొన్ని బడ్డీ లలో మాత్రమే గాజు గ్లాసుల్లో టీ మాత్రమే తాగుతున్నారు.. మిగిలిన అన్ని టీ బంకుల్లోనూ టీ తో పాటు జనాలు క్యాన్సర్ కారకాలను కూడా ఇష్టంగా చప్పరించేస్తున్నారు.. ఇదేదో సరదాగా వేస్తున్న సెటైర్ కాదు.. లండన్లో జరిగిన ఓ అంతర్జాతీయ సెమినార్లో నూటికి నూరు శాతం సైంటిస్ట్ లు చెప్పిన సత్యం. చదువుకునోళ్ళు, చదువులేనోళ్లు ఈ తేడా ఏమిలేదు.. విచక్షణ మరిచిపోయి.. వివేకం కోల్పోయి పేపర్ కప్పులు, ప్లేట్లలో పేరుకుపోయిన విషాన్ని హాటుహాటుగా సిప్ చేసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ద్రవ, ఘన పదార్థాలు.. ఇతర పానీయాల వినియోగం కోసం ఐ ఎమ్ ఏ ఆర్ సి నివేదిక ప్రకారం 264 బిలియన్ పేపర్ కప్పులు 2019లో ఉత్పత్తి అయినట్లు ఓ లెక్క. యాంత్రిక ప్రపంచంలో పరుగులు పెడుతున్న వినియోగదారులు తీవ్రమైన బిజీ షెడ్యూల్‌ల కారణంగా పేపర్ కప్పులను వినియోగించే వారి సంఖ్య ఎక్కువైంది. టేక్‌అవే సేవలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి డిమాండ్ పెరిగింది. పేపర్ కప్పులు ప్లేట్లు తిరిగి శుభ్రం చేయనవసరం లేకపోవడం ఈ తరహా బిజినెస్ లకు ఉపయుక్తంగా మారిన వీటిద్వారా “మైక్రోప్లాస్టిక్స్ అయాన్లు, పల్లాడియం, క్రోమియం మరియు కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు, అలాగే హైడ్రోఫోబిక్ ఇతర కర్బన సమ్మేళనాల వంటి కలుషితాలకు వాహకాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇటువంటి వాటిల్లో రెగ్యులర్ గా ఫుడ్ తీసుకుంటున్న వారిలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటుందని వారంటున్నారు.. ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్ ద్వారా ప్లాస్టిక్ లైనింగ్‌లను విడిగా జరిపిన పరిశీలినలో ఒక్క రోజుకి 75వేల మైక్రో ప్లాస్టిక్ కణాలను మనిషి శరీరంలోకి తీసుకుంటున్నాడన్న రిజల్ట్స్ షాక్ కి గురిచేసాయి. స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్ కణాలతో పాటు సబ్‌మైక్రాన్-పరిమాణ కణాలను మిల్లిక్యూ నీటిలోకి విడుదల చేయడాన్ని కూడా ఈ పరీక్షలు నిర్ధారించడం కలవరపరిచే అంశమే.ఒక వేడి టీ ని 15 నిముషాలు ఉంచితే డిస్పోజబుల్ పేపర్ కప్పులో సుమారు 10.2 బిలియన్ సబ్‌మిక్రాన్ పరిమాణ కణాలు ఆ టీ లో కలిసి పోవడాన్ని గుర్తించారు. రెగ్యులర్ గా మనం తాగి పారేసే ఈ పేపర్ కప్పుల తయారీ కూడా చాలా దారుణంగా ఉంటుంది.. నాచుతో నిండి వుండే వాటర్ ట్యాంక్ లో కుళ్ళబెట్టిన రా మేటిరియల్ని కాళ్ళతో తొక్కి మెత్తగా చేసి దాదాపు 15 రకాల కెమికల్స్ వాడతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కేమికల్స్ ఎక్కువ ఉంటాయి.. తయారైన కప్పు , ప్లేటు మెత్తబడకుండా కెమికల్ గమ్ ను వాక్స్ ని అందులో వేయడం జరుగుతుంది వేడి పదార్థాలు వేయగానే ఆ కప్పులో ఉన్న కేమికల్స్ బయటికి వచ్చి మనం తీసుకునే ఆహార పదార్థాలలో కలిసిపోయి మన శరీరానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి ఇంతకు మించిన దారుణం ఏమిటంటే చాలామంది ప్లాస్టిక్ కవర్లలో పోసుకొని వేడి వేడి టీ, కాఫీ, పాలు పార్సిల్స్ గా పట్టుకెళ్తుంటారు.. ఇది మరింత ప్రమాదసూచిక అని హెచ్చరిస్తున్నారు.. ప్లాస్టిక్ పర్యావరణానికి పూర్తి స్థాయిలో కీడు చేస్తుంటే.. ఈ పేపర్ కప్స్ , ప్లేట్స్ మనిషి శరీరానికి సంపూర్ణ స్థాయిలో హాని కలిగించి ప్రాణానికి ముప్పు గా మారాయి.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More