ప్రాణాలు తీసిన వయాగ్రా

ఆరాటం, అత్యుత్సాహం, అవగాహన లేని తనం అతని ప్రాణం తీసింది. ప్రియురాలని సంతోషపెట్టాలని అతను చేసిన ప్రయత్నం వికటించి విగత జీవిగా మారాడు. అతను తీసుకున్న వయాగ్రా అతని ప్రాణాలను హరించింది. శృంగార సామర్థ్యాన్ని పెంచుకుని తన ప్రియురాలితో మరింత సంతోషంగా గడపాలని భావించాడు. మద్యం సేవిస్తూ వయగ్రా పిల్స్ వేసుకున్నాడు. అంతే ఆ మరుసటి రోజు తెల్లారేసరికి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకున్నట్లు ఫోరెన్సిక్, లీగల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. 41 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఆ రాత్రి మద్యం సేవించాడు. ఇక మద్యం సేవిస్తూనే 50 ఎంజీ చొప్పున ఉన్న రెండు వయాగ్రా పిల్స్‌ను వేసుకున్నాడు. ఆ రాత్రంతా వ్యక్తి బాగానే ఉన్నప్పటికీ తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారుజామున వాంతులు చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రికి వెళ్దామని ప్రియురాలు చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు. గతంలోనూ ఇలాగే అయిందని చెప్పి ఊరుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చేసేదేమీ లేక అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. వయగ్రా పిల్స్ వేసుకోవడం వల్ల క్రమక్రమంగా అతని మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్ ఏర్పడటంతో అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యంతో కలిపి వయగ్రా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యాడని, తద్వారా ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. వైద్యుల సలహా లేకుండా అంగస్తంభన కోసం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును జర్నల్‌లో ప్రచురించినట్లు అందులో పేర్కొన్నారు

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More