తీవ్ర భూకంపంతో అస్తవ్యస్తమైన టర్కికు భారత సహాయక బృందం చేరుకుంది.. ఆగ్రాకు చెందిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ 89 మంది సభ్యుల వైద్య బృందాన్ని భారత్ పంపింది. వైద్య బృందాలే కాకుండా ఆర్థోపెడిక్ సర్జికల్ టీమ్, జనరల్ సర్జికల్ స్పెషలిస్ట్ టీమ్, మెడికల్ స్పెషలిస్ట్ టీమ్‌లను చేర్చడానికి వైద్య బృందం క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ టీమ్‌లు వెళ్లిన బృందంలో ఉన్నాయి. 30 పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు బృందాలకు ఎక్స్-రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆ కార్డియాక్ మానిటర్లు, అనుబంధ పరికరాలను ఈ బృందం తీసుకెళ్లింది. టర్కీ లో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఉంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్‌ను కూడా చేరవేశారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో పంపించారు. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్ మెషిన్‌లు, కటింగ్ మిషన్‌లు తదితర సామాగ్రి ఉన్నాయి. యాభై మందితో కూడిన తొలి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం టుర్కియేకు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు వెల్లడించారు. ఆగ్రా నుంచి కూడా మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకుంది.