దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాల కవ్వింపుల నేపథ్యంలో సరిహద్దుల ప్రాంతాలలో నిఘా ను కట్టుదిట్టం చేసింది భారత్. ఈ రెండు దేశాల నుంచి ఏదోరోజు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండటంతో భారత్ సేనలు అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కంటే చైనా తోనే ఘర్షణ వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది. చైనా దేశ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ఆ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల కాలంలో భారత భూభాగంలో కి చోచ్చుకు వచ్చేందుకు శత విధాలా ప్రయత్నించింది. భారత దళాలు చైనా ప్రయత్నాలను తిప్పుకొట్టాయి. ఎప్పటికైనా ఈ దేశం నుంచే ఎక్కువగా ముప్పు వచ్చే అవకాశం ఉండటంతో చైనా సరిహద్దు ప్రాంతమంతా నిఘాను ను పంచడమే కాకుండా భారత్ దళాలు అక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చైనా చర్యలపై ఆగ్రహంగా ఉంది. అటు పాకిస్తాన్ తో కానీ ఇటు చైనా ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉంది. ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఎయిర్ భేస్ లను పరిశీలించి ఎయిర్ మార్షల్ ఆపరేషనల్ ప్రిపేర్డనెస్ కు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్ కు బద్ధ శత్రువులైన చైనా, పాకిస్తాన్ లతో ఇప్పటికిప్పుడు యుద్ధానికి సిద్ధపరాల్సి వచ్చిన అందుకు సిద్ధంగా ఉండేందుకు ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.