ఆశయం అంబరమైతే సాధించేది సగమైనా ఉంటుంది.. అన్నది ఓ స్ఫూర్తిదాయకమైన మాట.. కానీ అతని సాహిత్యం అంబరాన్ని చుంభించాలని ఆశపడితే.. అక్షరం మాత్రం విశ్వానికి గురి పెట్టింది.. ఆ పదం జనపదమై హృదయాలను తాకాలనుకుంటే.. ‘నాటు’ కొట్టుడు కొట్టి ఆస్కార్ నే ఆభరణంగా చేసుకుంది.. అలసిపోని ఆ అక్షరం తెలుగోడిని తలెత్తలా చేయాలనుకుంటే.. మీసం మేలేసేలా విశ్వవేదికపై సత్తా చాటింది.. ఎక్కడో చల్లగరికె నుండి మొదలైన ఆ ప్రస్థానం భాగ్యనగరంలో సాహిత్య చిత్రికను పట్టి డాల్బీ ధియేటర్ లో మెరిసి మురిసింది.. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని చెప్తూ నే మౌనంగానే ఎదగమన ప్రబోధించిన ఆ మంచుకొండల్లోని చంద్రమే.. ఈరోజు పడమట ఉదయించి ఆస్కార్ తో మన వేకువయింది. గాయకుడు అవుతామని హైదరాబాద్ వచ్చిన సుభాష్ చంద్రబోస్ గేయరచయిత గా 19 నెలల పాటు ‘నాటు.. నాటు’ పాట కోసం పడిన ప్రసవ కష్టానికి ఆస్కార్ పురస్కారం అందుకోవడంతో తెలుగు నేల మళ్లీ పల్లవించింది.. ‘పచ్చిమిరపలాగా పిచ్చనాటు..’ ‘గడ్డపారలాగ చెడ్డ నాటు..’ అంటూ అచ్చ తెలంగాణ పల్లె పదాల రుచిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన గురి మొదటి నుంచి జాతీయ అవార్డు పై ఉంటే దేవుడు అంతకు మించిన ప్రపంచ అవార్డుతో సత్కరించటం ఓ వ్యక్తి చేసిన ఐదు వేల పాటల సాహితీ సేద్యానికి మచ్చుతునక.. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ఉత్తమ గేయ రచయితలుగా జాతీయ అవార్డు అందుకున్నారు శ్రీరంగం శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు( 1974) చిత్రానికి గాను ‘తెలుగువీర లేవరా’ పాటకు, వేటూరి సుందర మూర్తి మాతృదేవోభవ (1993)చిత్రానికి గాను ‘రాలిపోయే పువ్వా నీకు’ అన్న పాటకు,