మార్వెల్ సిరీస్ లో ఎన్టీఆర్ ?

మార్వెల్ సిరీస్ బ్లాక్ పాంథర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం నిజం కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. నటనలో పరిణితి చూపిస్తూ అటు తన అభిమానులనే కాకుండా ఇతర హీరోల అభిమానుల మనసులను కూడా గెలుచుకున్న ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. అదే సినిమాలో చేసిన రామ్ చరణ్ కూడా అంతే స్థాయిలో తెచ్చుకున్న గుర్తింపు తో త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం రామ్ చరణ్ కంటే ముందే హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. మార్వెల్ సీరిస్ లో వస్తున్న బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. ఆ సిరీస్ చేస్తున్న ప్రతినిధులు ఎన్టీఆర్ ని అప్రోచ్ అయినట్లు కూడా సమాచారం. హాలీవుడ్ మూవీలో భారత్ కు చెందిన ఎన్టీఆర్ లాంటి నటుడు చేస్తే ఆసియా కంట్రీస్ లో సినిమాకు మరింత బజ్ వస్తుందని, కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్. మూవీ ద్వారా గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ కు ఇది ఒక మంచి అవకాశం అని చెబుతున్నారు. బ్లాక్ పాంథర్ మూవీలో ప్రధాన పాత్ర చేసిన చాడ్విక్ బోస్మాన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ 43 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోవడంపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాడ్విక్ బోస్మాన్ అనారోగ్య కారణాలతో మృతి చెందడం తో అతను లేకుండానే ఈ సిరీస్ లో రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చే సీరీస్ లో ఆ క్యారెక్టర్ ఉండాలని భావిస్తున్నారు. ఆ పాత్ర కు తగిన నటుడు కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ సినీ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అందరి కళ్ళు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ల మీద పడ్డాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హాలీవుడ్ దర్శక నిర్మాతలు అతనితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సిరీస్ లో మెయిన్ రోల్ చేస్తే ఎలా ఉంటది అనే దానిపై చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే టాపిక్ హల్ చల్ చేస్తుంది. 2016 లో రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్, బ్లాక్ పాంథర్ సినిమాల్లో మార్వెల్ ప్రొడక్షన్స్ సూపర్ హీరోగా చాడ్విక్ మంచి పేరును, అభిమానులను సంపాదించుకున్నాడు.అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి పాపులర్ సినిమాల్లో కూడా బ్లాక్ పాంథర్ పాత్రను చాడ్విక్ పోషించాడు సినిమా, రియల్ లైఫ్ లో కూడా నిజమైన పోరాట యోధుడిగా నిలిచిన ఆ హీరో ప్లేస్ లో కొత్త బ్లాక్ పాంథర్ గా కనిపించే హీరో కోసం పూర్తిస్థాయిలో అన్వేషణ చేపట్టారు. ఎన్టీఆర్ ఇందులో చేస్తారనే ప్రచారం నిజమేతే చాలా బాగుండేదని ఎంతోమంది అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం వాస్తవం కాదని కొందరు సినీ పెద్దలు కొట్టి పారేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ కూడా ఖచ్చితమైన విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే చాలామంది అభిమానులు మాత్రం ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ కు బాగా సూట్ అవుతారని, భవిష్యత్తులో ఎన్టీఆర్ ను హాలీవుడ్ హీరోలా చూడాలని ఆశిస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More