మనదేశంలో ఎవరికైనా రెండు సార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందంటే అది వన్ అండ్ ఓన్లీ గునీత్ మాంగా అనే మహిళా నిర్మాత కి మాత్రమే.. ఆమె రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్”(2019) కి డాక్యుమెంటరీ విభాగంలో మొదటిసారి ఆస్కార్ పొందిన ఆమె రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్”(2023)డాక్యుమెంటరి కి మరోసారి ఆస్కార్ అందుకున్నారు. ‘నాటు..నాటు’ ఊపులో మన మీడియా ప్రోజెక్టు చేయని ఈ భారతీయ మహిళ ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్, ప్రొడక్షన్ కోఆర్డినేటర్ శిక్షణ పొందిన ఆమె ఇంటర్నేషనల్ ప్రొడక్షన్‌హౌస్ లకు ప్రొడక్షన్ కోఆర్డినేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు సే సలామ్ ఇండియా (2007) చిత్రం తో ఫిల్మ్ కెరీర్ ఆరంభించిన గునీత్ రంగ్ రసియా (2008) దస్విదానియా (2008) చిత్రాలకు పనిచేశారు. తర్వాత 2009లో, బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మించిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై (2010) నిర్మాణ సమయంలోనే దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్ టీమ్ లో చేరి కొన్ని చిత్రాలకు పనిచేశారు. గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ లో 12 మంది అత్యుత్తమ మహిళా సాధకుల్లో ఒకరిగా ఇండియా టుడే నిర్వహించిన భారతదేశ టాప్ 50 దిశానిర్దేశకులలో ఒకరుగా ఎంపికవ్వడమే కాకుండా ఫ్రెంచ్ ప్రభుత్వ పురస్కారాన్ని సైతం అందుకుని భారత దేశానికి గుర్తింపు తీసుకొచ్చారు ఆమె రూపొందించిన మొదటి ప్రధాన అంతర్జాతీయ చిత్రం 2010 లో అకాడెమీ అవార్డ్ ఫర్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా నామినేట్ అయింది.. గ్రెగ్ హెల్వీ దర్శకత్వం వహించిన బాండెడ్ లేబర్ (2009)లో స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకుంది.ఇదిలా ఉండగా, 2008లో సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి అనురాగ్ కశ్యప్‌తో కలిసి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, రెండు భాగాలు, దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ (2011), త్రిష్ణ (2011), షైతాన్ (2011), మైఖేల్ (2011), పెడ్లర్స్ (2012) తదితర చిత్రాలు నిర్మించారు. పెడ్లర్స్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్‌లో ఎంపికతో భారతీయ సినిమాకి కొత్త మార్కెట్ ను అందించారు. ఇప్పుడు రెండోసారి ఆస్కార్ పురస్కారం అందుకుని భారత కీర్తి కిరీటం లో మరో మెరుపు తునక అయ్యారు..