రెండుసార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చే ప్రభుత్వం తమదేనని ఢంకా బజాయించి చెప్తున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీకి ఎదిగేందుకు వేస్తున్న ఎత్తుగడలు పారెలా కనిపించట్లేదు.. దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలని ఆశిస్తున్న కేసీఆర్ ఆశలు సాఫీగా ముందుకెళ్లడం లేదు.. ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు పక్కా స్కెచ్ వేసిన గులాబీ బాస్ కు నదుల గండంతో నిద్ర పట్టడం లేదు.. పొరుగు రాష్ట్రాలని ఇన్నాళ్లు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన చంద్రశేఖర రావును ఆయా రాష్ట్రాల ప్రజలు అంత ఈజీగా ఆశీర్వదించేలా కనపడటం లేదు ఏదో రకంగా సాటి తెలుగోడని ఆంధ్ర ప్రజలు సరిపెట్టుకొని కటౌట్లు పెట్టినంత ఈజీగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కేసీఆర్ పార్టీని కనికరించేటట్లు అనిపించడం లేదు.. హైదరాబాద్ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించిన తర్వాత హైదరాబాద్ స్టేట్ లోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోకి.. మరికొన్ని కర్ణాటకలోకి.. కలిసిపోయి ఆయా ప్రాంతాల మనోభావాలను బట్టి.. భాషా సంస్కృతిని బట్టి.. స్థానిక నేతలు ఒత్తిళ్లు.. భాషా సారూప్య విధానాలను బట్టి.. ఆ రాష్ట్రాల్లో కలిసిపోయాయి అయితే ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రసమితిగా మారి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తరుణంలో నదీ వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.. మహారాష్ట్ర, కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ తో తెలంగాణకు తీవ్రస్థాయిలో ఉన్న నది వివాదాలు, ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును పాటించకుండా అంతర్ రాష్ట్ర నదీ జలాల వినియోగంపై ఉన్న ఉల్లంఘనలపై పరస్పర జల వివాదాలు ఇప్పుడు ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి ఆంధ్రప్రదేశ్ కు పూర్తిస్థాయి రాష్ట్ర అధ్యక్షుని బీఆరెస్ పార్టీ నియమించుకున్నప్పటికీ కర్ణాటక మహారాష్ట్రలో పెద్ద నాయకులు ఎవరు టిఆర్ఎస్ వైపు చూడటం లేదు.