Vaisaakhi – Pakka Infotainment

బీఆరెస్ కు నదుల గండం

రెండుసార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చే ప్రభుత్వం తమదేనని ఢంకా బజాయించి చెప్తున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీకి ఎదిగేందుకు వేస్తున్న ఎత్తుగడలు పారెలా కనిపించట్లేదు.. దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలని ఆశిస్తున్న కేసీఆర్ ఆశలు సాఫీగా ముందుకెళ్లడం లేదు.. ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు పక్కా స్కెచ్ వేసిన గులాబీ బాస్ కు నదుల గండంతో నిద్ర పట్టడం లేదు.. పొరుగు రాష్ట్రాలని ఇన్నాళ్లు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన చంద్రశేఖర రావును ఆయా రాష్ట్రాల ప్రజలు అంత ఈజీగా ఆశీర్వదించేలా కనపడటం లేదు ఏదో రకంగా సాటి తెలుగోడని ఆంధ్ర ప్రజలు సరిపెట్టుకొని కటౌట్లు పెట్టినంత ఈజీగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కేసీఆర్ పార్టీని కనికరించేటట్లు అనిపించడం లేదు.. హైదరాబాద్ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించిన తర్వాత హైదరాబాద్ స్టేట్ లోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోకి.. మరికొన్ని కర్ణాటకలోకి.. కలిసిపోయి ఆయా ప్రాంతాల మనోభావాలను బట్టి.. భాషా సంస్కృతిని బట్టి.. స్థానిక నేతలు ఒత్తిళ్లు.. భాషా సారూప్య విధానాలను బట్టి.. ఆ రాష్ట్రాల్లో కలిసిపోయాయి అయితే ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రసమితిగా మారి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తరుణంలో నదీ వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.. మహారాష్ట్ర, కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ తో తెలంగాణకు తీవ్రస్థాయిలో ఉన్న నది వివాదాలు, ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును పాటించకుండా అంతర్ రాష్ట్ర నదీ జలాల వినియోగంపై ఉన్న ఉల్లంఘనలపై పరస్పర జల వివాదాలు ఇప్పుడు ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి ఆంధ్రప్రదేశ్ కు పూర్తిస్థాయి రాష్ట్ర అధ్యక్షుని బీఆరెస్ పార్టీ నియమించుకున్నప్పటికీ కర్ణాటక మహారాష్ట్రలో పెద్ద నాయకులు ఎవరు టిఆర్ఎస్ వైపు చూడటం లేదు.. ఇతర పార్టీల లో ఇమడలేక ఉన్న కొంత మంది పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజలు చోటామోటా నేతలు స్వరాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నదులు వివాదం నేపథ్యంలోనే వెనకడుగు వేస్తున్నారని.. బిఆర్ఎస్ తో కలిసినా ఆ పార్టీతో నడిచిన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసిన పార్టీతో వెళ్లడం వలన తమకు వ్యక్తిగతంగా మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి పునరాలోచన లో పడ్డట్టు సమాచారం. ఇదిలా ఉంటే కెసిఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన దగ్గర్నుంచి సపోర్ట్ గా నిలిచిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాబోయే కర్ణాటక ఎన్నికల్లో బీఆరెస్ తో కలిసి వెళ్తారా లేదా అన్నది సందేహంగా మారింది తెలుగు ప్రభావిత ప్రాంతాల్లోనైనా పోటీ చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంటే ఎంతవరకు కన్నడపార్టీ దీనికి ఎంతవరకు సహకరిస్తుందో తెలియని పరిస్థితి సీట్ల సర్దుబాటుతో పోటీ చేయాలా..? లేక మద్దతు తెలిపి ఊరుకోవాలా అన్న చర్చ పార్టీలో కొనసాగుతోంది బీఆర్ఎస్ తో కలసి వెళ్తే తమ పరిస్థితి ఏంటి..? తిప్పి తిప్పి నది జలాల వివాదం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అన్న మీమాంస కన్నడ నాయకుల్లో ఎక్కువైంది సేమ్ టు సేమ్ మహారాష్ట్ర నేతలది ఇదే పరిస్థితి. పదవ జాతీయ పార్టీగా దేశంలో బిఆర్ఎస్ ప్రస్థానం మొదలవ్వాలంటే ముందు పొరుగు రాష్ట్రాల నుంచి అది మొదలవ్వాలి. దీనిపై ఆ పార్టీ ప్రణాళికలను నదులు ఏ మేరకు దాటిస్తాయో చూడాలి..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More