స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు… చంద్రుడిపైకి మూడోసారి చంద్రాయన్ కి సిద్ధం.. ప్రపంచానికి చాలా విషయాల్లో మనమే ఆదర్శం.. కానీ ఆదివాసులకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేం.. సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు నిలపలేం.. ఇది మన దుస్థితి. నాయకులు వున్నారు.. నిధులు ఉన్నాయి.. నడవడానికి రోడ్లే లేవు.. మన్యం లో ఓ బిడ్డకు బాగోలేకపోతే డోలీ కట్టి మూడు కిలోమీటర్లు ఎత్తైన కొండల మధ్య రాళ్లు రప్పలు దాటుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ తమ కష్టానికి నిందించుకుంటూ డోలీలో అర్ల గ్రామం వరకూ మోసుకొచ్చి అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యాధికారికి ఫోన్ చేసారు. ప్రైవేటు ఆటోలో అర్ల అనే గ్రామం నుంచి మళ్ళీ బుచ్చింపేట పీహెచ్ సీ కు ప్రయాణం.. ఫైనల్ గా సకాలంలో వైద్యం అందక హాస్పిటల్లో బిడ్డ మరణం.. కోoదు ఆదివాసి గిరిజన కుటుంబానికి చెందిన కిల్లో కమల (20) మొదటి కానుపు ఇంటి వద్దే బిడ్డను ప్రసవించింది. ఉదయం ఏడు గంటల సమయంలో బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని బుచ్చింపేట పీ హెచ్ సీ కి తీసుకొచ్చేందుకు డోలి కట్టుకొని వచ్చినా ప్రయోజనం లేదు.. మైనింగ్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కోసం రోడ్లు వేస్తారు కానీ ఆదివాసి గిరిజన గ్రామాలను కనీసం పట్టించుకోని నాధుడే ఉండడు. ఇటువంటి పరిస్థితుల్లో 2020 సంవత్సరంలో గిరిజనులే సొంతంగా డబ్బులు వేసుకొని శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసుకున్నప్పటికి భారీ వర్షాలు కారణంగా కొట్టుకుపోవడంతో మళ్లీ గర్భిణీ స్త్రీ ని తీసుకెళ్లడానికి డోలీ మోసుకునే పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో మాత్రం వరాలు కురిపించే ఈ గ్రామానికి అంగన్వాడీ సెంటర్ లేదు, స్కూలు లేదు, రోడ్డు సౌకర్యం అంతకంటే లేదు..ఇప్పటికైనా డోలీ కష్టాల నుంచి గట్టేక్కించాలని డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన ఫలితం శూన్యం.జిల్లా కలెక్టర్ నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టకపోవడం చాలా అన్యాయమని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు సౌకర్యం కల్పించకపోతే వచ్చే ఎన్నికలలో ఓట్లు వేయడానికి ముందుకు రామని గ్రామస్తులు అల్టిమేటం జారీచేశారు.. స్పందన చూడాలి