చంద్రుడిపై రష్యా కన్ను

చంద్రుడు మీద ప్రయోగాలకు అగ్ర రాజ్యాలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడు పై కాలు మోపాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో తాము నిర్దేశించుకున్న పరీక్షలను నిర్వహించడం కొనసాగకపోవడంతో మళ్లీ మళ్లీ ఈ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలలో పోటాపోటీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా అమెరికా, రష్యా చైనా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.భారత్ కూడా చంద్రుడి వీటి వరుసలో చేరింది. ఇదివరకు చంద్రుడి మీద చేసిన ప్రయోగం విఫలం అయినప్పటికీ మరోసారి ఆగస్టులో చంద్రయాన్ -3 ప్రయోగానికి సిద్ధమవుతుంది. 2025 లో తన వ్యోమగాములను పంపించేందుకు అమెరికా కూడా రెడీ అవుతుంటే చైనా వరుసగా లూనార్ ప్రయోగాలు చేపట్టింది. ఇక తాజాగా రష్యా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చంద్రుడిపై దిగే స్పేస్‌క్రాఫ్ట్ లూనా-25 ప్రయోగాని కి రష్యా రెడీ అయ్యింది. 1976 తర్వాత చంద్రుడి మీదకు రష్యా లూనార్ ప్రోబ్‌ను పంపిస్తోంది. కొన్ని దశాబ్ధాల తర్వాత రష్యా మూన్ పరీక్షకు సిద్ధమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్‌మస్ ఈ ప్రయోగానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసింది. లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ను జూలై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికి సాంకేతిక కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఏవియానిక్స్‌లో లోపాలు ఉన్నట్లు రాస్కాస్‌మస్ చీఫ్ యూరి బొరిసోవ్ తెలిపారు. ఈ కారణంగానే గత ఏడాది జరగవలసిన ప్రయోగం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా లూనా-25 ప్రయోగాన్ని సమర్థవంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 30 కేజీల సైంటిఫిక్ ఎక్విప్మెంట్‌తో లూనా 25నింగికి ఎగరనున్నది. చంద్రుడిపై అనేక పరీక్షలను ఆ మిషన్ ద్వారా చేపట్టనున్నారు. చంద్రుడి దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్లవిస్కీ క్రేటర్ వద్ద ఇది ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More