అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని.. ఇది దేశంలో రికార్డు అని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఒక్కో టేబుల్‍లో ఎన్ని లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం పంపింది.. పోస్టల్ బ్యాలెట్ లు గతంలో ఎప్పుడూ లేనంత భారీగా నమోదవడంతో అధికార పార్టీలో కలవరం మొదలైందని కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లునమోదు కాగాఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు పొలయ్యాయి. కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్ల నమోదులో మూడోస్థానం లో ఉంది. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు.. అయితే కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని టీడీపీ ఈసీ ని కోరింది.