బాలీవుడ్ లో అడుగుపెట్టాలనే కోరిక ప్రతి సౌత్ హీరోయిన్ కు ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ అంతా హిందీలోని స్టార్ హీరోలతో సినిమా చేయాలని కోరుకుంటారు. దీనికి భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది స్టార్ హీరోయిన్ సంయుక్త. ఆమె ఫస్ట్ హిందీ మూవీ కంటెండ్ బేస్డ్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో సంయుక్త నటించనుందని టాక్ వినిపిస్తోంది. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్ తేజ్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. తెలుగులో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.