సైబర్ నేరస్థులు అప్డేట్ అయిన ప్రతి టెక్నాలజీ ని వాడేస్తూజనాల్ని మోసం చేయడం లో బిజీ అయిపోయారు ప్రజల అమాయకత్వం, అత్యాశ పెట్టుబడి నేరస్థులు రెచ్చిపోతున్నారు. అలాంటి కేడీ గాళ్ళ ఎత్తులను తిరుపతి సైబర్ క్రైం పోలీసులు ఛేదించారు.. తిరుమల లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి కి ఇండస్ ఇండ్ (indusind) కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నట్టు గా మీరు కేవైసీ(KYC) అప్‌డేట్ చేసుకోవాలని లేకపోతే మీ యొక్క క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పి ఓటీపీ (OTP) చెప్పమనగా చెప్పడంతో వెంటనే క్రెడిట్ కార్డు నుండి 1,42,545/- డెబిట్ అవ్వడంతో సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చారు డెబిట్ అయిన అమౌంట్ హౌసింగ్ డాట్ కామ్ (housing.com) కి ట్రాన్స్ఫర్ అయినట్ట్టు గుర్తించడం తో వెంటనే సైబర్ క్రైమ్ టీం హౌసింగ్ డాట్ కామ్ కి నోటీసును సర్వ్ చేసి కేటుగాళ్ళు బుక్ చేసిన ఆర్డర్స్ అన్ని కాన్సిల్ చేసి బాధితుని యొక్క క్రెడిట్ కార్డుకి 1,42,545 అమౌంట్ ను 20 నిముషాల లోపల రీఫండ్ అయ్యేలా విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరయినా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే అధైర్య పడకుండా సైబర్ క్రైమ్ విభాగం కు వెళ్లి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు జిల్లా ప్రజలను కోరారు. సైబర్ క్రైమ్ బారిన పడిన రెండు గంటల గోల్డెన్ హౌర్స్ మించకుండా వెళ్ళినట్లయితే సకాలంలో న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా వుంటుందని వివరించారు. స్వయంగా ఫిర్యాదు చెయ్యడానికి అందుబాటులో లేనట్లయితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని లేదా www.cybercrime.gov.in అన్ లైన్ గాని ఫిర్యాదు చేయవచ్చును అని తెలిపారు.