ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని వున్న క్యాడర్ అంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టనష్టాలను.. అనుభవించిన టార్చర్ ను పదవులు పొందడం ద్వారా సంతృప్తి పడదామనుకుంటుంటే.. నామినేటెడ్ పోస్టుల పందారం ఎప్పటికప్పుడు రేపే అన్నట్టే వుంది..రోజులు గడిచిపోతున్నాయి … ప్రభుత్వం నుంచి ఆ తీపి వార్త రావడం లేదు.. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపినప్పటికి భర్తీ మాట మాత్రం లేదు.. అయితే ఆలస్యానికి వినిపిస్తున్న కారణం ఏంటంటే.. నామినెటెడ్ పదవుల పెంపకానికి సెవెంటీ తర్టీ ఫార్ములా సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.. 70 శాతం టీడీపీకి.. మిగతా ముప్ఫై శాతం జనసేన, బీజేపీకి ఉమ్మడిగా పంచుతారని అంటున్నారు.. ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య చర్చలు కూడా జరిగాయని చెప్తున్నారు..
అయితే పొత్తులు ఉన్న చోట్ల కూడా త్యాగం చేసి.. ఆయా పార్టీల విజయాలకు పని చేసింది తామేనని టీడీపీ నేతలంటున్నారు. జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు కానీ.. క్యాడర్ లేదని.. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారన్న కారణంగా పదవులు ఇస్తే పని చేసిన టీడీపీ నేతలు అసంతృప్తికి గురవుతారన్న భావన ఉందంటున్నారు. అలాగే బీజేపీ విషయంలోనూ అదే జరుగుతుందని … అందుకే పదవుల ప్రకటన ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైన టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు అలాగే కేబినెట్ హోదా ఉన్న పదవులకు పోటీ చాలా ఎక్కువే వుంది. పదవుల పంపకం ఆలస్యం అవుతున్న కొద్ది వాటన్నింటి కోసం పార్టీ కోసం శ్రమ పడిన వారి లో నిర్లిప్తత మొదలైంది.. అయితే చంద్రబాబు మాత్రం ఏదీ తేల్చలేకపోతున్నారు. ఇదిగో అదిగో ఊరిస్తున్నారే తప్పా అడుగు ముందుకు పడటం లేదు.. సందట్లో సడేమియా అంటూ పదవులు ఫలానా వాళ్లకే నంటూ విస్తృత ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉందన్నది ఎవరికీ తెలియదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ లో కాస్తంత అసంతృప్తి అయితే ఉంది. గతం లో వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న నొప్పి ఓ వైపు .. రాజకీయంగా పదవులు దక్కడం లేదన్న బీపీ మరో వైపు ఇలా నలిగి పోవడంతోనే సరిపోతుందని అంటున్నారు.ముందుగా కీలక నేతల పదవులభర్తీ అయితే సెకండరీ గ్రేడ్ నాయకులు ఆ తరవాత మండల గ్రామ స్థాయి నేతలు ..పోస్టుల పంపకం నిర్వహించొచ్చు. టీడీపీ నేతలు గత ఐదేళ్లలో పడిన కష్టం కన్న తరవాత ఎన్నికల్లో చేసిన త్యాగమే ఎక్కువని భావిస్తున్నారు..