లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం లో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్న మా నాన్న సూపర్‌హీరో దసరా పండుగ సందర్భంగా విడుదల కానునట్లు మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు. మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు.