రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన..?

కొత్త గా ఏర్పడిన తెలంగాణ పది వసంతాల పండగ జరుపుకుంటున్న తరుణంలో జిల్లాల పునర్విభజన మాట మళ్ళీ తెరపైకి వచ్చింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి ఇప్పుడిప్పుడే మంత్రులకు శాఖల కేటాయింపు జరగడం తో అన్ని శాఖల సమీక్షలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో లో కొన్ని ప్రాంతాల నుంచి జిల్లాల విన్నపం రావడంతో వాటిని పరిశీలించనున్నారని సమాచారం.. అధికారం లోకి వస్తే జిల్లాల పునర్విభజన అంశాన్ని పరిశీలిస్తానని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల విభజన విషయం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా సౌలభ్యం కోసమంటూ 33 జిల్లాలు గా పునర్విభజన చేశారు.అయితే కేసీఆర్ తన లక్కీనంబర్‌ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.

అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పెద్ద జిల్లాలను విడదీసారని నియోజకవర్గ ప్రాతిపదికన విభజన శాస్త్రీయంగా జరగలేదు అన్నది ప్రధాన ఆరోపణ కొన్ని జిల్లాల్లో ఒకటిన్నర నియోజకవర్గం ఉండడం.. మరి కొన్ని నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండడం వంటివాటిని పట్టించుకోలేదు. దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016లో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టిన కొడుకు కోసం ఒక జిల్లా.. కూతురు కోసం మరో జిల్లా.. అల్లుడు ఆడిగాడని ఇంకో జిల్లా ఎవరూ అడగకపోయినా తన లక్కీ నంబర్‌ రావడం లేదని మరో జిల్లా.. ఇలా ఇష్టానుసారం జిల్లాలను ప్రకటించారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. పాలనా సౌలభ్యం అని ప్రకటించినా.. అధికారం అంతా ప్రగతిభవన్‌లోనే ఉండడంతో జిల్లాల విభజనతో పెద్దగా ప్రజలకు ఒనగూరింది ఏమీలేదన్నది ప్రధాన విమర్శ. రాజకీయ నిరుద్యోగులకు పదవులు దొరకడం రెవెన్యూ డివిజన్లతో ఆర్డీవోలు పెరగడం మినహా పెద్దగా ఒనగూడేదేమి లేదన్నది ప్రజల మాట.. గత ప్రభుత్వ హయం లో జరిగిన అన్నిటిపై ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశాస్త్రీయ జిల్లాల విభజనపై పునఃసమీక్షించాలని భావిస్తోంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉందని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా జిల్లాల విభజన సహేతుకంగా జరగలేదన్నది కొందరి మాట.. కొన్ని జిల్లాలను పూర్తి గా నిర్వీర్యం చేసేటట్లుగా భౌగోళిక విభజన జరిగిందని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు మొదటి నుంచి జిల్లాల పునర్విభజన పై దృష్టి పెట్టినప్పటికి ఐదేళ్ళ కాలంలో చేయలేకపోయారు.. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. అమరావతి ని చిదిమెసే ప్రయత్నం లో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా జరిగింది. ప్రకాశం అతిపెద్ద జిల్లాగా అప్పటి ప్రభుత్వ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం అతి చిన్న జిల్లా గా అవతరించాయి. నెల్లూరు ఎక్కువ జనాభా కలిగిన జిల్లాగా పార్వతీ పురం మన్యం తక్కువ జనాభా కల జిల్లాలుగా విభజింపబడ్డాయి.. ఇందులో కొన్ని జిల్లాల వికేంద్రీకరణ సరి కాదన్న విమర్శలు ఉన్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ జిల్లాల పునర్విభజన పై వినతులు మొదలయ్యాయి. తెలంగాణ లో జరిగిన పొరపాట్లు గాని గతం లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మిస్టేక్స్ అవ్వొచ్చు అలాంటివి జరగకుండా ఈ సారి పునర్విభజన చేయాలన్న టార్గెట్ తో ప్రభుత్వం ఉంది.. దీనిపై ఒక కమిటీ వేసే ఆలోచన లో ఏపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.. ఈసారి రెండు రాష్ర్టాల ప్రక్షాళన లో భాగంగా సహేతుకమైన జిల్లాల ఏర్పాటు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

మొదట్లో మన కరెన్సీ పై మహాత్మగాంధీ ని వద్దనుకున్నారు.. కానీ….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More