రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయఅవార్డు లభించింది. లండన్ కి చెందిన పబ్లిషింగ్ హౌస్’సెంట్రల్ బ్యాంకింగ్’ నుంచిరిస్క్ మేనేజర్ ఆఫ్ దిఇయర్ అవార్డు ను అందుకుంది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రిస్క్ కల్చర్, అవేర్ నెస్ పెంపొందించినందుకు గాను అవార్డు అందుకున్నట్లు మిశ్రా తన ఎక్స్ ఎకౌంటు లో పేర్కొన్నారు.పర్యవేక్షణ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ సవాల్ గా తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ అంశాల అమలు లో వుండే ప్రతికూలతలు సవాళ్లు ఎంత మేరకు ఉంటాయి అన్న దానిపై విస్తృత ప్రయోగాలు నిర్వహించిన ఆర్బీఐ ఈ ఏడాది చివరి నాటికి గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ పూర్తి అవుతుందని ప్రకటించింది. డేటా సెంటర్ పరిశోధనకు మరియు సామర్థ్య నిర్మాణానికి మరియు ఆర్థిక సేవల రంగం యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి ప్రాథమిక వనరుగా ఉంటుందని తెలిపింది..ఆర్‌బిఐ తన డిజిటల్ మిషన్‌లో భాగంగా, మౌలిక సదుపాయాలు, చెల్లింపులు, రిస్క్ మేనేజ్‌మెంట్, ఆడిట్ మరియు వంటి కీలక రంగాలలో AI మరియు ML వినియోగాన్ని ప్రోత్సహించింది.భారీ డేటాను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి AI- ఆధారిత సాధనాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, ఆర్బీఐ (RBI) తన వార్షిక నివేదికలో పేర్కొందని ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంది..