భాగ్యనగరం సిగలో మరో మరో ఆణిముత్యం చెరనుంది.. రియాల్టీ రంగం లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హైదరాబాదు కు మరో అంతర్జాతీయ దిగ్గజసంస్థ రాబోతుంది.. ఇప్పటికే ఎన్నో ప్రపంచశ్రేణి ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రమైన మన హైదరాబాదు కు వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ హాత్వే హోం సర్వీసెస్ కంపెనీ ఇక్కడ రియల్ వ్యాపారం మొదలుబెట్టబోతోంది.. హైదరాబాదు తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నామని సంస్థ చైర్మన్ గినో ప్రకటించారు. ఇక్కడి కార్యకలాపాలకోసం మరో దిగ్గజ సంస్థ ఒరెండో తో కలసి బెర్క్ షైర్ హాత్వే హోం సర్వీసెస్ ఒరెండో ఇండియా పేరుతొ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ లను చేపట్టనున్నారు 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న దేశీయ రియాల్టీ లోకి తాము అడుగుపెడుతున్నందుకు సంస్థ హర్షం వ్యక్తం చేసింది. దాదాపు వెయ్యి మంది రియల్ ఎస్టేట్ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపట్టనున్నారు