బ్రహ్మీ ముహూర్తము అంటే….

సూర్యోదయానికి 90 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తముగా వ్యవహరిస్తారు. ఇది బ్రహ్మ జ్ఞానా ధ్యానములకు అనుకూల సమయం.బ్రహ్మీ అనగా సరస్వతి.మనలోని బుద్ధి ప్రభోదము చెందే కాలం కనుకే ఈ సమయాన్ని బ్రహ్మీముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్త కాలాన్ని పూర్వం ఘడియలలో లెక్కించేవారు. ఘడియ అంటే 24 నిమిషాలు.ఒక ముహూర్తం అంటే 2 ఘడియల కాలం అని అర్థం. ప్రస్తుత లెక్క ప్రకారం చూస్తే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంనకు 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి.సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మీముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29 వది బ్రహ్మీముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మీ ముహూర్తం అనే పేరు వచ్చింది.సూర్యోదయంనకు ప్రతిరోజు బహ్మీ ముహూర్తమున నిద్ర లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి. బ్రహ్మీమూహూర్తానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపైఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. కశ్యపబ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు.ఈయన గరుత్మంతునికి సోదరుడు. అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసు కోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకములో మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమని పిలుస్తారు అని చెప్పాడు. ఆ సమయానికి ఏ నక్షత్రాలు, గ్రహలు కూడా కీడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.అందుకే బ్రహ్మముహూర్త కాలంలో అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ బ్రహ్మీ ముహూర్త కాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మీముహూర్తం. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో చేసే ధ్యానం వలన మనకు ఆధ్యాత్మిక శక్తి సిద్ధిస్తుంది. బ్రహ్మీముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచు కుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు.ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. బ్రహ్మీముహూర్తమున నిద్రలేచిన వారికి అమృత మయమగు వాయువు పీల్చుట చేత మానవుని శరీరం ఆరోగ్యమగును, ముఖము కాంతి వంతంగా వెలుగును. బుద్ధి కుశలత పెరుగును. ఆరోగ్యం, సురక్షితమైన మానసిక స్థితి వలన శరీరం శక్తివంతంగా తయారు అవుతుంది. ఇదే బ్రహ్మీ ముహూర్తము యొక్క విశిష్టత.

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More