కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ ప్రజాస్వామ్యం పదవుల్లో ఉంటే ఒకలాగా పదవులు కోల్పోతే ఒకలాగా రూపాంతరం చెందుతూ ఉంటుంది.. అలాంటి అవకాశవాద రాజకీయాల కారణంగా పార్టీ పరపతి చాలాసార్లు ప్రమాదంలో పడింది. అంతర్గతంగా కానీ బహిర్గతంగా గాని క్రమశిక్షణ కోల్పోతున్న ఆ పార్టీ నాయకుల వల్ల కేవలం కొని రాష్ట్రాల్లో మాత్రమే ఉనికిలో ఉంది. అవకాశాల వెతుకులాటలో విధానాలకు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తున్న ఆ కొంత మందిని ఇక సాగనంపాల్సిందే అన్న వాయిస్ అయితే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బాగానే వినిపిస్తుంది టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా చేసినప్పటి నుండి వచ్చిన సమస్య ఇది కానే కాదు ఇలాంటి చిక్కులు.. సమస్యలు సృష్టించడం కాంగ్రెస్ డిఎన్ఏ లోనే ఉందని కొంతమంది విశ్లేషకులు ఉటంకిస్తున్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఆస్తులు సమకూర్చుకొని పెద్ద నాయకులుగా ఎదిగిన ఆ సీనియర్లు ఈరోజు మరోసారి నిరసన గళాన్ని అందుకోవడం వారికి పాజిటివ్ మైలేజ్ కన్నా నెగిటివ్ పబ్లిసిటీనే బాగా తెచ్చి పెట్టింది తెలుగుదేశం ఇతర పార్టీ నుండి వచ్చిన వారికే పార్టీ పగ్గాలు అప్పగించారని తమని గౌరవించకపోయిన పర్వాలేదు.. కనీసం సూచించిన వారికి కూడా పదవులు ఇవ్వలేదని ఆరోపిస్తూ సీనియర్లు అందరూ అలిగి ఒకటయ్యారు ఇప్పటివరకు అధిష్టానాన్ని క్షేత్రస్థాయికి రానివ్వకుండా తప్పుడు సమాచారం.. సలహాలతో పార్టీ పతనానికి ఇతోదికంగా తోడ్పడిన వీళ్ళే మరోసారి కట్టు కట్టి వెన్నుపోటుకు సిద్ధమయ్యారు.. వీరి చర్యలు మాత్రం కరడుగట్టిన పార్టీ అభిమానులకు మాత్రం మింగిడుపడటం లేదు. అధిష్టానం అప్పగించిన పార్టీ పదవులకు 13 మంది రాజీనామా చేయడంతో ఈ రచ్చ మరింత రాజుకుంది నిన్నకాక మొన్న తిరుమల పర్యటనకు వచ్చిన కోమటిరెడ్డి తాను ఏ పార్టీలోను ప్రస్తుతం లేనని చెప్పడాన్ని ఇంతవరకు సదరు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త బాహాటంగానే విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి చీఫ్ కాకుంటే ఆల్మోస్ట్ పాతాళానికి వెళ్ళిపోవాల్సిన పార్టీ నిలబడిందని కేడరు చెవులు కోరుకుంటున్నారు మైలేజ్ చేస్తున్న సీతక్క లాంటోళ్లే పార్టీకి కావాలని.. నిత్యం లొల్లి చేసే ఇలాంటి నేతలు కారని తెగేసి చెప్తున్నారు. టీ కప్పులో తుఫాన్ లో కనిపించే ఈ శీతాకాలం సునామీ ని చల్ల పరచడానికి డిగ్గీరాజా రంగంలోకి దిగి చేసిన సూచనలను మన్నించిన సీనియర్ల చర్యల్లోనూ మాటల్లోని ఇప్పుడిప్పుడే తేడా మొదలైంది ప్రజలు కార్యకర్తల సపోర్ట్ కోల్పోయిన సీనియర్లు ఇప్పటికీ తమవాదనే రైటన్న ధోరణితోనే ముందుకెళ్తున్నారు విశ్లేషకులు.. సర్వే సంస్థల గణాంకాల ప్రకారం రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలతో పూర్తిగా తడబడే అవకాశం ఉందని అంటున్నారు కోవర్ట్ అంశం కూడా ప్రస్తుతానికి రావడంతో దానిపై తీవ్ర చర్చ జరగనుండడం ఖాయమనిపిస్తుంది. ఇప్పటికైనా ఓవైపు బీజేపీకి మరోవైపు బీఆర్ఎస్ కి హస్తమిస్తున్న నేతలను ఏకీపారిస్తే గాని పార్టీ బాగుపడదని. లేకపోతే కొంతమంది ఆరోపిస్తున్నట్టు బిజెపి ఆడించే నాటకంలో కాంగ్రెస్ డక్ అవుట్ అవ్వడమే లేటు అని గట్టిగా వినిపిస్తున్న మాట. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీస బోణి కొట్టాలంటే ఇప్పుడు నిరసనలు వినిపిస్తున్న నేతలకు సెలవివ్వడమే సరైన మార్గమని పార్టీ కిందిస్థాయి నేతలు కార్యకర్తలు చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్ ను ఎప్పుడు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ కనీసం ఇప్పుడేనా క్షేత్రస్థాయి వారి మాటలు వింటే బాగుంటుందని సూచిస్తున్నారు..