కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో విశ్వ కవి రవీంద్రనాధ్ టాగోర్, మిసైల్ మెన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఫోటోలను ముద్రిస్తారన్న వార్తలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఖండించింది. భారత ప్రముఖుల ఫోటోలతో కొత్త నోట్ల ముద్రణ చేపట్టనున్నట్టు గత కొద్ది రోజులు గా ప్రచారం లో ఉన్న వార్తలను కొట్టిపారేస్తూ ఈ ప్రకటన చేసింది.. కేంద్ర ఆర్థిక శాఖ , ఆర్బీఐ కొత్త నోట్ల ప్రింట్ కోసం ప్రణాళిక లు డిజైన్లు సిద్ధం చేసిందని పుకార్లు చక్కర్లు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన ప్రాధాన్యత ను సంతరించుకుంది.. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త నాణాలను విడుదల చేశారు.. 75 ఏళ్ల స్వతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కి అమృత్ మహోత్సవ్ లోగో ని ముద్రించిన 1,2,5,10,20 రూపాయల మారకపు విలువ గల నాణాలను విడుదల చేసారు ఇవి స్మారక నాణాలు కావని అన్ని చెలామణి లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త నాణాలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.