రూ. 2 వేల నోట్లు తగ్గాయ్… చెలామణీలో ఉన్నవి 1.6 శాతమే

2000 నోట్ల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 214 కోట్లకు చేరాయి. మొత్తం చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి సంఖ్య 1.6 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు కాగా గత ఏడాది ఈ సర్క్యులేషన్ 12,437 కోట్లుగా ఉంది. మార్చి 2020 చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉంది. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే మొత్తం నోట్ల సంఖ్యలో 2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు తగ్గింది. అంటే మొత్తం నోట్లలో 1.6 మాత్రమే ఉన్నాయి. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్ నోట్లు చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. ‘సంఖ్యాపరంగా రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోట్లు మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో 21.3 శాతంగా ఉన్నాయి’ అని ఆర్బీఐ 2021 వార్షిక నివేదిక వెల్లడించింది. రూ. 500 డినామినేషన్ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం, మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉన్నాయి. విలువ పరంగా ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి రూ. 28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 31.05 లక్షల కోట్లకు పెరిగింది. ‘విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతంగా ఉంది. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతంగా ఉంది..’ అని నివేదిక తెలిపింది. బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం 2021-22లో 9.9 శాతం, 5 శాతం పెరగగా, 2020-21లో 16.8 శాతం, 7.2 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More