ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్, కేసీఆర్ ల స్థానం ఎంత..?

సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపీనియన్‌ సర్వే(సీఎన్‌వోఎస్‌) నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా లో దిగువ నుంచి ఆరో స్థానంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌.. నిలవగా 11వ ర్యాంకులో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వున్నారు. నవీన్‌ పట్నాయక్‌ నంబర్‌ వన్‌ స్థానం లో ఉండగా మిగిలిన టాప్ ఫైవ్ స్థానాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, ఇటీవలే పదవి నుండి వైదొలగిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ , పంజాబ్‌ సీఎం భాగవంత్ సింగ్ మాన్ లు మొదటి ఐదు స్థానాల్లో ప్రజాధరణ పొందారు.వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని గొప్ప నాయకుడని.. అత్యంత జనాదరణ ఉన్న సీఎం అంటూ వైసీపీ వర్గాలు ఎప్పుడు చెపుతూవుంటాయి. కానీ ప్రా మాణిక సర్వేల్లో ఆయన చివరినుంచి ఆరవ వరుసలో నిలవడం వైసీపీ వర్గాలను విస్తుపోయేలా చేశాయి. ప్రధాని నరేంద్రమోదీతోపాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్‌వోఎస్‌ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా..25 మంది సీఎంలలో ఆయన జగన్‌ 20వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 39 శాతం మంది ఆయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 11వ స్థానంలో నిలిస్తే ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉండగా.. 19 శాతం మం ది అసంతృప్తితో ఉన్నారు. 24 మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా.. 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో జనాదరణ పొందిన మొదటి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నవీన్‌ 51 పాయింట్ల నికర ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలవగా.. జగన్‌ తర్వాత అట్టడుగున నిలిచిన సీఎంలలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(హరియాణా), బసవరాజ్‌ బొమ్మయ్‌(కర్ణాటక), నీఫూ రియో(నాగాలాండ్‌), ప్రమాద్‌ సావంత్‌ (గోవా), మాణిక్‌ సాహా(త్రిపుర) ఉన్నారు. సీఎన్‌వోఎస్‌ తాజా సర్వే ప్రకారం ప్రధాని మోదీకి ప్రజాదరణ స్వల్పంగా పెరిగింది. గతంతో పోలిస్తే నికర ఆమోదం రేటింగ్‌ 36 పాయింట్లకు చేరుకుంది. దేశంలో 54 శాతం మంది ఆయన  నాయకత్వాన్ని ఆమోదించారు. 18 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More